
జులై 29వ తేదీ అర్ధరాత్రి దాటాక..అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. వయనాడ్ జిల్లా మెప్పాడి కొండ ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఏకంగా నాలుగు గ్రామాలు తుడుచుపెట్టుకుపోయాయి. కొండ చరియలు, బురద మట్టిలో వందలాది మంది చిక్కుకుని ప్రాణాలొదిలారు. ఇలాంటి విపత్తులు కేరళ రాష్ట్రానికి కొత్త కాకపోయినా..ఈ విపత్తు అనుకోకుండా జరిగిందా, కచ్చితమైన కారణాలేంటనేది పరిశీలిస్తుంటే షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో చిన్న నదులు, వాగులు, వంకలు పోటెత్తాయి. ముఖ్యంగా కొండల్లోంచి ప్రవహించే ఛళియార్ నది పోటెత్తుతోంది. దీనివల్లే మెప్పాడి కొండ ప్రాంతంలోని కొండ చరియలు విరిగి పడి నదితో పాటు కొట్టుకొచ్చేశాయి. వెల్లువలా దూసుకొచ్చిన వరద ప్రవాహంతో బురద దిగువన ఉన్న ముందక్కై, చూరమల, అత్తామల, నూల్ఫుజల గ్రామాలను ముంచెత్తాయి. అర్ధరాత్రి కావడంతో అందరూ గాడనిద్రలో ఉన్నారు. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో.. శాశ్వత నిద్రలో జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధి అయ్యారు. ఎంతో అందమైన ప్రాంతంగా గుర్తింపడ్డ ఆ ప్రదేశం గంటల వ్యవధిలోనే రాళ్లు రప్పలు, బురద మట్టి, శిథిలాలు, మృతదేహాలతో నిండిపోయింది. ఇప్పటి వరకూ 161 మంది మరణించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని సమాచారం.
అయితే వయనాడ్ విపత్తుతో ముందు జాగ్రత్తలు తీసుకోలేదా, విపత్తును ఎందుకు పసిగట్టలేకపోయారన్న వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కేరళలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా కొండ చరియలు విరిగి పడటం సహజమే. మరి అలాంటప్పుడు కేరళ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అక్కడున్న ప్రజల్ని ఖాళీ చేయించలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ డాక్టర్ శేఖర్ లుకోస్ నిర్ఘాంతపోయే సమాధానాన్ని చెప్పారు.
నిజానికి మెప్పాడి కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతానికి..వరద ఉధృతికి కొట్టుకుపోయిన నాలుగు గ్రామాలకు మధ్య దూరం 6 కిలోమీటర్లు ఉంది. నిజం చెప్పాలంటే కొండ చరియలతో ఏ మాత్రం సంబంధం లేని గ్రామాలు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏ మాత్రం జనావాసాలు లేని ప్రాంతం అయినా కూడా అదంతా కిందకు కొట్టుకొచ్చి ఏ మాత్రం సంబంధం లేని ఈ నాలుగు గ్రామాలలో వచ్చి పడటం ఎవరూ ఊహించినది. నదీ ప్రవాహానికి దూరంగా, కొండలకు దూరంగా ఉన్న నాలుగు గ్రామాలపై బురద మట్టి, కొండ చరియలు కొట్టుకురావడమేనేది ఎంత మాత్రం అంచనా వేయలేనిది.
నిజానికి మెప్పాడి ప్రాంతంలో మూడు కాలనీలను జులై 28న అంటే ఘటన జరిగే ముందు రోజే ఖాళీ చేయించారు. కానీ ఈ నాలుగు గ్రామాలపై బురద, కొండచరియలు వచ్చి పడుతుందనేది ఊహించని పరిణామం. అయితే వరద ఉధృతి పెరిగి ఛళియార్ నది వాస్తవ పరిమాణం కంటే వెడల్పు కావడంతో పాటు రెండుగా చీలి ప్రవహించడంతో ఈ విపత్తు జరిగినట్లు దీనికి కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ డాక్టర్ శేఖర్ లుకోస్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయన్న అంచనాకు మించి జరిగిన విపత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ