తొలి డిబేట్ లో ఎవరిది పైచేయి.. ట్రంప్.. హ్యారిస్?

Who Has The Upper Hand In The First Debate Trump Harris, First Debate Trump Harris, Who Has The Upper Hand In The First Debate, First Debate Between Trump Harris, Joe Biden, Kamala Haris, The First Debate Between Trump Harris, Trump, US Presidential Election Race, US Presidential Election To A Flag Level, Trump Harris Presidential Debate, Harris Trump Debate, US Presidential Debate, Donald Trump Defeat, Kamala Harris, Donald Trump, USA, America Elections, US Elections 2024, US Political News, Political News, Mango News, Mango News Telugu

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు హోరాహోరిగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.  బరిలో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ తాజాగా.. మొట్టమొదటిసారి ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే తొలిసారి ముఖాముఖిగా తలపడిన ట్రంప్-హారిస్ చర్చను.. ప్రపంచ దేశాలు గమనించాయి. గతంలో ట్రంప్-బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్‌లో ట్రంప్ పై చేయి సాధించగా.. తాజాగా జరిగిన ట్రంప్-హారిస్ డిబేట్‌లో కమలా హారిస్‌దే పై చేయి అని అమెరికా మీడియా వెల్లడించింది. ఈ డిబేట్ సందర్భంగా.. కమలా హారిస్ చాలా ధీటుగా బదులిచ్చారని అమెరికా మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఏబీసీ మీడియా: కమలా హారిస్పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు చేసినట్లు డిబేట్ను నిర్వహించిన ఏబీసీ మీడియా తెలిపింది. ట్రంప్ విమర్శలకు దీటుగా స్పందించిన హారిస్.. సమయం వృథా చేయకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడినట్లు తెలిపింది.

పొలిటికో: ఈ డిబేట్లో కమలా హారిస్ విజయమని పొలిటికో అభిప్రాయపడింది. అది కూడా స్వల్ప తేడాతో కాదని.. భారీ విజయంగానే పేర్కొంది.

 ది న్యూయార్క్ టైమ్స్: ట్రంప్ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్గా తనకున్న అనుభవాన్ని కమలా హారిస్ ఉపయోగించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హారిస్పై ఆధిపత్యం సాధించేందుకు బదులు తనను సమర్ధించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం చేశారని చెప్పింది.

వాషింగ్టన్ పోస్ట్: ట్రంప్ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని, 2020 అధ్యక్ష ఎన్నికల నాటి వాదననే తెరమీదకు తీసుకువచ్చారని పేర్కొంది.

సీఎన్ఎన్: కమలా హారిస్ పూర్తి సన్నద్ధతతో వచ్చారని ఆమె ప్రతి సమాధానం ఆయనకు కోపం తెప్పించేలా ఉందని సీఎన్ఎన్ పేర్కొంది. దీంతో ఒక్కోసారి ట్రంప్ సహనం కోల్పోయినట్లు కనిపించారని తెలిపింది.

ఫాక్స్ న్యూస్: డిబేట్ లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాక్స్ న్యూస్ పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలి రోజుల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరించారు. గతంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున మొదట అభ్యర్థిగా ఎన్నికైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ చాలా ముందువరుసలో ఉండేవారు. బైడెన్‌తో జరిగిన తొలి డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయి కావడం గమనార్హం. అయితే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ స్థానంలో కమలా హారిస్‌ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ట్రంప్‌ కంటే హారిస్‌ ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. తాజా డిబేట్‌లో కమలా హారిస్‌ తన సత్తాచాటడంతో డెమోక్రాట్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరగనున్నాయి.