
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా , 72 మంది మంత్రులతో కలిసి కేంద్ర కేబినెట్ ఏర్పాటు అవగా వారిలో 30 మంది కేబినెట్ మంత్రులుగా మరో ఐదుగురు స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మంది సహాయ మంత్రులుగా మంత్రివర్గంలో ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ కేబినెట్ తొలి సమావేశం సోమవారం జరగనునంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశం ఉంటుంది.
అయితే ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలైన తెలుగు దేశం పార్టీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి మూడోసారి ప్రధానమంత్రి పదవిని స్వీకరించారు మోదీ. ఫలితాలు వెలువడిన ఐదో రోజు జూన్ 9న మోదీతో సహా 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
కీలక మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలకు రెండు మంత్రి పదవులు అంటే ఒక కేబినెట్ ర్యాంకు, ఒక రాష్ట్ర మంత్రి పదవి దక్కాయి. అయితే తాజాగా మరో కీలక పదవి అయిన లోక్ సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌లు అయిన టీడీపీ, జేడీయూ నేతలు ఈ పదవిపై కన్నేసినా కూడా.. దానిని వదులుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు.
రాజ్యాంగం ప్రకారం, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ మొదటిసారి సమావేశమవడానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. హౌస్‌లోని సీనియర్ సభ్యుల నుంచి రాష్ట్రపతి కలిసి.. ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నిమిస్తారు. ఈ ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత సాధారణ మెజారిటీతో హౌస్ సభ్యుల నుంచి ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
లోక్‌సభ స్పీకర్ పదవిని పొందడానికి నిర్దిష్ట ప్రమాణాలు, ప్రత్యేక నియమాలు వంటివి ఏవీ ప్రత్యేకంగా లేకపోయినా… రాజ్యాంగం, పార్లమెంటరీ నియమాలపై అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే రెండు సార్లు జరిగిన ఎన్నికలలో కూడా లోక్ సభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో బీజేపీ నుంచి సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్ ఎన్నికయ్యారు.
నిజానికి లోక్ సభ స్పీకర్ పదవి అనేది చాలా కీలకమైన పదవి. ఫిరాయింపులు వంటివి జరిగినపుడు సభ్యులపై అనర్హత వేటు వేయడం వంటి కేసులను నిర్ణయించడంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. లోక్ సభ స్పీకర్‌కు సంపూర్ణ అధికారం ఉంటుంది. చాలా సార్లు ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. పార్టీలో తిరుగుబాటుకు దిగడంతో..అది కాస్తా పార్టీ చీలికలకు దారి తీసి ప్రభుత్వాన్నే పడగొట్టిన సందర్భాలు కూడా జరిగాయి. అందుకే ఈ సారి ఇలాంటి ఘటనలకు చోటివ్వకుండా ఉండటానికి టీడీపీ, జేడీయూ ఈ పదవిని కోరుకుంటున్నా దీనికి బీజేపీ ఇష్టపడటం లేదు. దీంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తికర చర్చ మొదలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE