మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల పేర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారు మ్రోగిపోతోంది. ఇటీవల జరిగిన చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవంలో.. ప్రధాని మోడీ స్వయంగా చిరంజీవి వద్దకు వెళ్లారు. ఒకవైపు చిరంజీవి.. మరోవైపు పవన్ కళ్యాణ్‌ల చేతులు పట్టుకొని పైకి లేపి జనాలకు విజయసంకేతాన్ని చూపించారు. సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించి.. ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి గెలుపొందారు. లోక్ సభకు ఎంపికయ్యారు. దీంతో దాదాపు పది చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. త్వరలోనే వాటిని భర్తీ చేయాల్సి ఉంది. అటు గతంలో చిరంజీవిత రాజ్యసభకు నెగ్గి ఇండిపెండెంట్ చార్జీతో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మోడీ మంత్రి వర్గంలో 72 మంది ఉన్నారు. ఇంకా తొమ్మిది మందిని తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో చిరంజీవిని రాజ్యసభకు పంపించి.. ఆ తర్వాత మోడీ కేబినెట్‌లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట.
అలా కాకపోతే మరో రెండేళ్లలో అంటే 2025లో ఏపీలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అవన్నీ టీడీపీ కూటమికే వస్తాయి. అప్పుడయినా చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నారట. అటు మెగా అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఈక్రమంలో చిరంజీవిని పెద్దల సభకు పంపించేందుకు ఆయన కూడా సుముఖంగా ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రిగా చూడొచ్చనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE