
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని.. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందన్న ఖర్గే.. మోదీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదని హాట్ కామెంట్లు చేశారు.
ఇది మైనారిటీ ప్రభుత్వమంటూ చెప్పిన ఖర్గే.. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని సెన్సేషనల్ కామెంట్లు చేశారు. కానీ,తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం తాము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. దేశాన్ని పటిష్టం చేయడానికి ఇండియా కూటమి అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దేశానికి మంచి జరుగుతుందని అంటే మాత్రం ఆ పని జరగనివ్వకుండా చేయడం ఆయనకు అలవాటని ఖర్గే విమర్శించారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ భారతదేశాన్ని పటిష్ట పరుచుకోవడానికే కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయదుమారాన్ని రేపుతున్నాయి. తెర వెనుక నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏమైన పావులు కదుపుతోందా? అందుకే ఖర్గే ముందస్తుగా ఈ కామెంట్లు చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.
ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మొత్తం 240 సీట్లు వచ్చాయి. కానీ ఇది మెజారిటీకి అవసరమైన 272 సీట్లు కంటే తక్కువ.దీంతో జేడీయూ, టీడీపీ,జనసేన కూటమి ఒక్కటవడంతో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వచ్చింది. దీంతో ఇప్పుడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ