యాదాద్రి దారిలో అద్భుతం: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శివలింగం!

800kg Gold Shiva Lingam The Divine Ramaneswaram Shrine Near Yadadri

హైదరాబాద్ – యాదాద్రి ప్రధాన రహదారిపై భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది “రమణేశ్వరం స్వర్ణ దేవాలయం”. ఇక్కడ కొలువైన సుమారు 800 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారైన మూడు అడుగుల శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శివలింగంగా గుర్తింపు పొందింది. శ్రీ రమణానంద మహర్షి పర్యవేక్షణలో నిర్మితమైన ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ 2000 శివలింగాలకు ఏకకాలంలో అభిషేకాలు నిర్వహించడం విశేషం.

ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఆదిపరాశక్తి దర్బార్ మరియు స్పటిక లింగాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. త్వరలో ఇక్కడ ఆరు అడుగుల భారీ బంగారు విగ్రహాలను కూడా ప్రతిష్టించనున్నారు. యాదాద్రి వెళ్లే భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు, కళా వైభవానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here