విజయవాడ ఇంద్రకీలాద్రిలో ‘స్మోకింగ్ ఫ్రీ జోన్‌’ విధింపు.. ఉల్లంఘిస్తే ఫైన్ రూ. 200

AP Vijayawada Durga Temple Area Declared as Smoking Free Zone From Tomorrow, Vijayawada Durga Temple Area Declared as Smoking Free Zone From Tomorrow, Durga Temple Area Declared as Smoking Free Zone From Tomorrow, Smoking Free Zone, AP Vijayawada Durga Temple, Vijayawada Durga Temple, Vijayawada Durga Temple Area Declared as Smoking Free Zone, AP Vijayawada, Durga Temple, Durga Temple Area, Smoking Free Zone News, Smoking Free Zone Latest News, Smoking Free Zone Latest Updates, Smoking Free Zone Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన, విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిని ‘స్మోకింగ్ ఫ్రీ జోన్‌’ గా విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రిలో కూడా భక్తులకు అసౌకర్యం కలుగకుండా, దేవాలయ పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ అధికారులు వివరించారు. ఈ మేరకు జూన్ 26 నుంచి కనకదుర్గ ఆలయ పరిసర ప్రాంతాలను ధూమపాన రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు సంబంధిత అధికారులను కోరారు. దేవాదాయ శాఖ, ఆరోగ్య, పోలీసు తదితర శాఖల అధికారులతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయమని, ఎన్‌ఫోర్స్‌మెంట్ తరహాలో పరిసర ప్రాంతాలను ధూమపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. అలాగే ఘాట్‌రోడ్డు, కాలిబాట, భక్తులు ప్రయాణించే ఇతర ప్రాంతాల్లో ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రం మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించటానికి ఆలయానికి వస్తుంటారని, వారి మనోభావాలను గౌరవించాలని సూచించారు. దీంతో ఇకపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రకటనల నిషేధం మరియు వాణిజ్యం మరియు ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ నియంత్రణ) చట్టం 2003 ప్రకారం ఆలయంలో మరియు చుట్టుపక్కల సందర్శించే భక్తులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని ఆయన అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =