చాలామంది హిందువులు తరచూ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. వెళ్లిన ప్రతిసారీ పూజలు, అర్చనలు, అభిషేకాలు వంటివి చేయించుకున్నా, చేయించుకోకపోయినా దేవుడి దర్శనం తర్వాత హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు. వారి శక్తికి తగ్గట్లు ఎవరికి తోచినంత వారు హుండీలో డబ్బులు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది 11 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు, 500 రూపాయలు వేస్తూ ఉంటారు. మరికొంతమంది తమ మొక్కుకున్నట్లు వేస్తూ ఉంటారు.
అయితే అలా ఎలా పడితే అలా.. ఎంత డబ్బుులు పడితే అంత డబ్బులు హుండీలో వేయకూడదని పురణాలు చెబుతున్నాయి. దేవుడికి మనం హుండీలో సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుందట. ఒక్క లెక్క ప్రకారం మనం హుండీలో దేవునికి డబ్బులు సమర్పిస్తే.. చాలా కోరికలు తీరుతాయట. ఆలయానికి వెళ్లినప్పుడు స్వామివారు లేదా అమ్మవారికి మనం హుండీలో ఏడు రూపాయలు కనుక సమర్పిస్తే.. మనకు ఉన్న ఎలాంటి కష్టాలైనా దూరమైపోతాయని పురాణాలు చెబుతున్నాయట. అంతేకాదు హుండీలో 7 రూపాయలు వేస్తే.. మనలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయట.
అలాగే గుడికి వెళ్లినప్పుడు మనం హుండీలో కనుక స్వామివారికి లేదా అమ్మవారికి 9 రూపాయలు కనుక వేస్తే..ఎవరి నుంచి అయినా మనకు శత్రు భయం ఉంటే.. అది వెంటనే తొలగిపోతుందట. అంతేకాదు మనకు శని గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయట.
ఆలయానికి వెళ్లినప్పుడు ఆ భగవంతునికి భక్తి పూర్వకంగా మనం హుండీలో 11 రూపాయలు వేసినా కూడా మంచి ఫలితాలు దక్కుతాయట. 11వ సంఖ్య చంద్రుడికి సంకేతం కనకు మనం హుండీలో 11 రూపాయలు వేస్తే.. మనకు ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా తగ్గిపోతాయట. అంతేకాదు అప్పుల బాధ నుంచి విముక్తి కూడా ఉంటుందట.
అలాగే గుడికి వెళ్లినప్పుడు స్వామి, అమ్మవార్లను మనసారా తలచుకుని అక్కడి హుండీలో 12 రూపాయలను వేయడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటామట. ఇంట్లో ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే హుండీలో 12 రూపాయలు వేసి దాని నుంచి బయటపడొచ్చు.
అలాగే దరదృష్టం వెంటాడుతుందని అనుకునేవాళ్లు గుడికివెళ్లి అక్కడి హుండీలో 21 రూపాయలు సమర్పిస్తే కనుక మన దురదృష్టం పారిపోయి అదృష్టం కలిసి వస్తుందట. అందుకే గుడికి వెళ్లేవాళ్లు ఈ హుండీలో వేసే రూపాయల లెక్కలను దృష్టిలో పెట్టుకుని దేవుడికి డబ్బులు సమర్పించాలని పురాణాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY