ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేలా, విశాఖపట్నంలో ‘ఇండియాస్ లాంగెస్ట్ స్కై గ్లాస్ బ్రిడ్జ్’ ప్రారంభమైంది.
Ramya Harish Vibes యూట్యూబ్ ఛానెల్లో దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. నేల నుంచి ఏకంగా 200 అడుగుల ఎత్తులో, 55 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ కాంటీలివర్ గ్లాస్ బ్రిడ్జ్ సాహస ప్రియులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తుంది.
జర్మన్ గ్లాస్, యూకే నుంచి తెప్పించిన రోప్స్ ఉపయోగించి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో ఈ బ్రిడ్జిని నిర్మించారు . భద్రత కోసం ఒకేసారి 40 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈ కొత్త ఆకర్షణ విశాఖ టూరిజంను మరింత పెంచుతుందని నిర్వాహకులు తెలిపారు.






































