నేటి కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. కేర్ హాస్పిటల్ Nephrologist Dr. P. Vikranth Reddy ‘మాంగో లైఫ్’ ఇంటర్వ్యూలో కిడ్నీ ఆరోగ్యంపై కీలక విషయాలు పంచుకున్నారు. కిడ్నీ వ్యాధులను ‘సైలెంట్ కిల్లర్స్’ అని పిలుస్తారు, ఎందుకంటే చాలా సందర్భాల్లో వ్యాధి ముదిరే వరకు స్పష్టమైన లక్షణాలు కనిపించవు.
ముఖ్య లక్షణాలు & నిర్ధారణ: కేవలం కాళ్ళ వాపుల ఆధారంగానే కాకుండా, బ్లడ్ టెస్ట్ (క్రియాటినిన్), యూరిన్ టెస్ట్ మరియు అల్ట్రాసౌండ్ ద్వారానే కిడ్నీ పనితీరును ఖచ్చితంగా తెలుసుకోవచ్చు . మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
కిడ్నీ సమస్యల పట్ల అపోహలు వీడి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని డాక్టర్ సూచించారు.





































