తక్కువగా నిద్రపోతున్నారా? అసలు రాత్రుళ్లు నిద్రే పట్టడం లేదా? జాగ్రత్త మీ లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే..

Do You Know That Sleep Deprivation Causes Severe Diseases,Do You Know That Sleep Deprivation,Sleep Deprivation Causes,Sleep Deprivation Causes Diseases,Sleep Deprivation Causes Severe Diseases,Mango News,Mango News Telugu,Sleep deprivation,Less Sleeping,Lack of concentration,Hormonal imbalance,Impact on emotions,Sleep Deprivation,Effects of Sleep Deprivation on Your Body,Lack of sleep,How Does Sleep Affect

ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది కామన్ ప్రాబ్లెమ్‌గా మారిపోయింది. అర్థరాత్రి దాటినా నిద్రపోకుండా లేచి ఉండటం, మొబైల్ ఫోన్‌తోనో, టీవీలతోనూ కాలక్షేపం చేసేవారు ఎంతో మంది ఉంటారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల కానీ, అలాగే సోషల్ మీడియాకు అడిక్ట్ అవడం కానీ..లేదా ఇతర వ్యసనాలకు అలవాటు పడినా తమ నిద్రను త్యాగం చేస్తున్నారు. అయితే ఇది చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కనీసం 7నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు. కానీ, ఇప్పుడు సరిగ్గా 4 నుంచి 5 గంటల సేపు పడుకోవడమే గగనం అయిపోయింది. అయితే అదే అలవాటు అలాగే కొనసాగితే.. అది చాలా తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. నిద్ర తక్కువ అయితే ఎలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళతారో వివరిస్తున్నారు.

నిద్ర తక్కువ అయితే కలిగే చాలా ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే ..అభిజ్ఞా పని తీరు తగ్గిపోతుందట. అంటే మనిషి మెదడు పనితీరు తగ్గిపోతుందట. మనిషికి తగినంత నిద్ర లేనప్పుడు, మీ మెదడు.. ఏ సమాచారాన్ని కూడా సమర్థవంతంగా ప్రాసెస్ చేయదు. కనీసం నిల్వ చేయదు. అందుకే నిద్ర లేకపోతే ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి బలహీనపడటం, చెప్పిన విషయాలకు ఎప్పుడో రియాక్టవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది తరువాత జీవితంలో చిత్తవైకల్యం వంటి దీర్ఘకాలిక మానసిక వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదంతో ముడిపడి ఉంటుంది.

నిద్ర తక్కువగా ఉంటే కారణం లేకుండానే బరువు పెరిగిపోతారు. ఎందుకంటే మీకు తగినంత నిద్ర లేనప్పుడు.. అది మీ హార్మోన్లు అసమతుల్యతపై ప్రభావం చూపిస్తాయి. ఇది ఆకలిని తగ్గించడం లేదా, పిచ్చిపిచ్చి తిండిని తినాలనిపించేలా క్రేవింగ్స్ రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా చిన్నపాటి పనులకే అలసిపోయినట్లుగా ఉంటారు ఒక్కోసారి ఏ పని చేయకపోయినా అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల శారీరక శ్రమ చేయలేరు. ఈ మధ్య అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం, సరిగ్గా నిద్రపోని వాళ్లు ఎన్ని వ్యాయామాలు చేసినా.. వాటి ఫలితాలు పొందలేరని తేల్చాయి. నిద్ర లేకపోవడం కూడా మీ రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఎందుకంటే, మీరు నిద్రపోతేనే మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే ఏవైనా అంతర్లీన సమస్యలను రిపేర్ చేసుకుంటుంది. మీరు సరిగా నిద్రపోలేనపుడు ఈ ప్రక్రియలు ఏమీ జరుగవు.ఎందుకంటే నిద్రకు తగిన సమయాన్ని ఇవ్వనప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. దీంతో త్వరగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.

నిద్రపట్టకపోవడం అనేది మీ మానసిక స్థితిపై, అలాగే మీ భావోద్వేగాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.అంటే మీకు తగినంత నిద్ర లేనప్పుడు, చిన్నిచిన్నకారణాలకు కూడా తరచూ కోపం రావచ్చు లేదా చిరాకుగా అనిపించవచ్చు. అంతేకాదు మీరు ప్రతీ విషయంలోనూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.చిన్నపాటి విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు. అలాగే మీ మనుసు మీరు చెప్పే మాటలను వినే స్టేజ్ దాటిపోతుంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆలోచిస్తూ మీలో మీరే మదనపడిపోతూ ఉంటారు.

నిద్ర తక్కువైతే భావోద్వేగాలను నియంత్రించ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతెందుకు రాత్రిపూట తగినంతగా నిద్రపోకపోవడం వల్ల.. టోటల్ మీ పగలంతా మారిపోయి మీ జీవన నాణ్యత మొత్తం తగ్గిపోతుంది. నిద్రలేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. ఆఫీసులో మీ పనితీరు తగ్గిపోయి ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందుకే ప్రశాంతంగా ఉండటానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వంటివి చేయండి. ఎన్ని చేసినా నిద్ర రాకపోతే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి. అలాగే పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్‌ను ముట్టుకోవద్దు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 1 =