వయసు పెరిగే కొద్ది మహిళలకు ఆరోగ్యం విషయంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకే, 30, 40ల వయసులో ఉన్న మహిళలు కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే ఫ్యూచర్లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని , దీనికి బదులు ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రెగ్యులర్ బ్లడ్ టెస్ట్: మహిళలు అనేకాదు ఎవరైనా సరే ప్రతీ ఏడాది తప్పనిసరిగా జనరల్ చెక్ అప్ కోసం వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా ఎనేమియా టెస్ట్, బ్లడ్ ప్రెజర్ టెస్టు, కొలెస్ట్రాల్ చెకప్, బ్లడ్ గ్లూకోజ్ టెస్టు, విటమిన్ డి లాంటి టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి.
హర్మోన్ల పరీక్షలు:శరీరంలో హార్మోన్ల అసమతుల్యత మహిళలకు చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. దీనికోసం మహిళలు హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. వివిధ రకాల హార్మోన్ల లోపం గురించి హార్మోన్న పరీక్షల్లో బయటపడతాయి.
మమ్మోగ్రామ్:40 ఏళ్లు దాటిన మహిళకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలందరూ మోమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ టెస్ట్ ద్వారా రొమ్ము సమస్యలు ఏమైనా ఉన్నా, రొమ్ము క్యాన్సర్ ఉన్నా బయటపడుతుంది. రొమ్ముల్లో నొప్పి, గడ్డలుగా అనిపించడం, చర్మపు రంగు మారడం వంటివి కనిపిస్తే వెంటనే మమ్మోగ్రామ్ చేయించుకోవాలి.
పెల్విక్ పరీక్ష: పాతికేళ్లు దాటిన మహిళలకు పెల్విక్ అంటే గర్భాశయ ముఖద్వారం వద్ద ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటాయి. పెల్విక్ పరీక్షను ద్వారా చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ఈ పరీక్షల్లో బయటపడుతుంది.
ఎముకల సాంద్రత పరీక్ష: ఏజ్ పెరుగుతున్న కొద్ది మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ పెళుసుబారడంతో చిన్న చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా బోన్ డెన్సిటీ టెస్ట్ -బీఎండీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎముకల దృఢత్వం ఏ స్థాయిలో ఉందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పరీక్ష ద్వారా క్లారిటీ వస్తుంది.