ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది టెక్నాలజీ సాయంతో ఈజీగా పనులు చేసుకుంటున్నారు. వీలు కానివారు పక్కవారితో అయితే స్మార్ట్ ఫోన్స్ తోనే ఈజీగా పనులు చేయించుకుంటున్నారు. అలా తెలంగాణ ప్రభుత్వం మై-పంచాయతీ అనే ఒక కొత్త యాప్‌ను తీసుకురాబోతోంది. దీనిలో 20 రకాల పనుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నిజానికి 5G కూడా అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వాలు, ఆయా ఉద్యోగ సంస్థలు కూడా వారి వారి పనులను యాప్ ల ద్వారానే చేయించుకుంటున్నాయి. సాంకేతికత పెరగడంతో పనుల్లో కూడా వేగం పెరిగిందని గుర్తించిన ప్రభుత్వాలు కూడా ఎక్కువగా దానిపైనే ఆధారపడుతున్నాయి. చాలా కార్యక్రమాలకు సపరేట్ గా యాప్ లను తయారు చేసి మరీ వాటి నుంచి వివరాలు నమోదు చేసి ఈజీగా పని అయ్యేలా చేస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే యాప్ ను తయారు చేసింది. అంతకు ముందు ప్రజా పాలన అనే కార్యక్రమంలో తీసుకున్న అర్జీలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం..ఇందిరమ్మ ఇండ్లు యాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రజా పాలనలో తీసుకున్న అర్జీల్లో ఇల్లు లేని వారి వివరాలను ముందుగా పరిశీలించి.. లబ్దిదారులకు ఒక రోజు ముందు ఫోన్ చేసి తర్వాత రోజు తర్వాత వెళ్లిన అధికారులు కానీ సిబ్బంది కానీ.. ఇందిరమ్మ ఇండ్లు యాప్ లో వివరాలు నమోదు చేస్తారు. ఈ యాప్ నుంచి తీసుకున్న వివరాలు నేరుగా ప్రభుత్వానికి వెళ్తాయి. అక్కడి అధికారులు వాటిని పరిశీలించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఇలా చాలా విషయాలకు ప్రభుత్వాలే తమకు, లబ్ధిదారులకు ఈజీగా ఉండేలా సొంతంగా యాప్ లు తయారు చేస్తున్నాయి. ఇలాగే తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకురాబోతోంది. దీని ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన చాలా పనులు శరవేగంగా పూర్తవుతాయి. అంటే ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే సమీపంలో ఉన్న ఆఫీసుకు వెళ్లి ఆ పని చేసుకోవాలి. దీనివల్ల గంటల గంటల సమయం వృథా అవుతుంది. దీనివల్ల పనులు కూడా వేగంగా కావడం లేదన్న కారణంతో ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకువస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్ ను పంచాయతీ పరిధిలోనే వినియోగించనుంది. జనన, వివాహ, మరణ, ఇంటి నిర్మాణ అనుమతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా చాలా పథకాలు, సర్టిఫికెట్లు మొత్తం 20 రకాలకు సంబంధించి మై-పంచాయతీ యాప్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు గ్రామ సమస్యలపైన కూడా ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చట. ఈ యాప్ వస్తే అటు ప్రభుత్వం, ఇటు వినియోగదారులపై భారం తగ్గుతుందని చర్చ జరుగుతోంది.