చాలామంది తెల్లారింది మొదలు పడుకునే వరకూ గూగులమ్మ జపం చేస్తూనే ఉంటారు. ఏ చిన్న డౌట్ వచ్చినా అందులో వెతికి అనుమానాలు తీర్చేసుకుంటారు. అందం నుంచి అంతరిక్షం వరకూ ఎలాంటి సందేహాలున్నా.. గూగుల్ సెర్చ్‌తో సమస్యకు చెక్ పెట్టేస్తున్నారు. తాజాగా గూగుల్ క్రోమ్ తన యూజర్స్ కోసం అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. లిజన్ టు దిస్ పేజ్ పేరుతో ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫీచర్‌తో తప్పకుండా యూజర్స్ మనసును దోచేస్తుందని అంటోంది.
లిజన్ టు దిస్ పేజ్ ఫీచర్ సహాయంతో మొబైల్‌లో వెబ్ పేజీని ఎంచక్కా వినొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వెబ్ పేజీలో బ్రౌజ్ చేసినపుడు.. అందులో టెక్ట్స్ రూపంలో ఉన్న కంటెంట్‌ను లిజన్ టు దిస్ పేజ్ ఫీచర్ చదివి వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ సహాయంతో వెతికే కంటెంట్‌ను వారు కోరుకునే భాషల్లో వినే అవకాశాన్ని కల్పించింది. మొబైల్ స్క్రీన్ లాక్‌లో ఉన్నా కూడా బ్యాక్ గ్రౌండ్‌లో ఆడియో వినిపిస్తూనే ఉంటుంది
ప్రజెంట్ ఈ ఫీచర్ అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, జపనిస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ వంటి లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంచిన ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ పరిచయం చేయబోతున్నారు.
ఫీచర్‌ను ఉపయోగించాలంటే దీని కోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లోని క్రోమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత కావాలి అనుకున్న విషయాన్ని సెర్చ్ చేస్తే చూడాలన్నకుంటున్న పేజీని ఓపెన్ అవుతుంది. ఆ పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత రైట్ సైడ్‌లో ఉండే పేజీ నిలువు మూడు డాట్స్ మీద క్లిక్ చేయాలి. అందులో కనిపించే మెనూలో లిజన్ టు దిస్ పేజ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే.. క్రోమ్ పేజ్ కంటెంట్ చదవడం ప్రారంభిస్తుంది. వాయిస్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే నచ్చిన భాషను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE