జన్యవులలో మార్పులు ఏర్పడితే నీలికళ్లు వస్తాయా?

Research on people with blue eyes,Black eyes, brown eyes, blue eyes, cat eyes, green eyes, changes in genes, will blue eyes occur?, genetic mutation, eyes, hypothesize there may be a link between eye color, study of eyes, blue-eyed humans, Mango News Telugu, Mango News
Research on people with blue eyes,Black eyes, brown eyes, blue eyes, cat eyes, green eyes, changes in genes, will blue eyes occur?

ఎవరిని అయినా వర్ణించాలన్నా, మనుషుల మధ్య తేడాను చెప్పాలన్నా ముందులో వారిలో ఆకట్టుకునే కళ్లు గురించే చెబుతారు.  కళ్లు ఆకర్షణగా ఉంటే ఏదో తెలియని అట్రాక్షన్ వారిలో ఉన్నట్లే ఉంటుంది.సాధారణంగా కొంతమందికి నల్ల రంగులో కళ్లు ఉంటే, మరి కొంతమందికి గోధుమ కలర్ కళ్లు ఉంటాయి. అలాగే ఇంకొంతమందికి నీలం కళ్లు కూడా ఉంటాయి. ఒకప్పుడు అపశకునంగా భావించే ఈ నీలి కళ్లు లేదా పిల్లి కళ్లు..ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాయి. అలాంటి  నీలి కళ్లు వ్యక్తులపై జరిగిన  ఒక పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నిజానికి నీలికళ్లతో ఉన్న ప్రతీ వ్యక్తి కూడా ఒకే వ్యక్తి వారసుడంటూ కొంతమంది అంటుంటారు. దీంతో ఇది  నిజమా లేక అపోహ మాత్రమేనా అనే  విషయాలను గురించి పరిశోధకులు వివరించారు. ప్రపంచంలోని 70 నుంచి 80 శాతం మందికి గోధుమ కళ్లు ఉండగా.. 8  నుంచి 10 శాతం మందికి మాత్రమే నీలం కళ్లు ఉన్నాయి.  అలాగే 2 శాతం మందికి  ఆకుపచ్చ కళ్లు కూడా ఉన్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ చెప్పిన దాని ప్రకారం, సుమారు 10 వేల సంవత్సరాల క్రితం వరకు కూడా భూమిపై నివసించే ప్రతి మనిషికి గోధుమ కళ్లు ఉండేవని చెబుతున్నారు.

ఈ పరిశోధనలో కొంతమంది పిల్లలకు వారి తల్లిదండ్రులకు నీలి కళ్లు లేకపోయినా నీలి కళ్లుతోనే పుట్టారు.  దీని వెనుక సైన్స్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.  ఓ వ్యక్తి జన్యువులలో మార్పు వచ్చినప్పుడు వారి పిల్లలు  నీలి కళ్లతో పుడతారని నిపుణులు చెబుతున్నారు. ఈ జన్యు మార్పు వల్ల గోధుమ కళ్లు.. నీలి కళ్లుగా మారుతాయట. అలాగే లాడ్బైబిల్   నివేదిక ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్‌లో  ఓ నిపుణుడు  @daveallambymd అకౌంట్లో ఓ వ్యక్తి నీలి కళ్లు కలిగిన  వ్యక్తులందరూ ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఎందుకంటే వీళ్లంతా  6 వేల నుంచి 10 వేల సంవత్సరాల క్రితం నల్ల సముద్రం సమీపంలో నివసించిన వ్యక్తికి  వారసులుగా చెప్పుకొచ్చారు.

డాక్టర్ అల్లంబి అనే ఓ పరిశోధకుడు, ఎవరికైనా కూడా తనలాంటి నీలి కళ్లు ఉంటే, మనమందరం అదే వ్యక్తి వారసులం అయినట్లే అని చెబుతున్నారు. కాబట్టి ప్రపంచమంతటా నీలి కళ్లున్న వారందరికీ  700 మిలియన్లు అంటే.. 70 కోట్లకు పైగా బంధువులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక జన్యు మార్పు ఇంత కాలం ఎలా కొనసాగిందో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − one =