ఏప్రిల్‌లో అధికంగా బ్యాంక్ సెలవులు: ముందుగానే ప్లాన్ చేసుకొండి..

ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండటం సాధారణమే, కానీ ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులు పలు రోజుల్లో మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలా బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. వివిధ రాష్ట్రాల్లో జరిగే పండగలు, మహానుభావుల జయంతులు, వర్థంతులపై ఆధారపడి బ్యాంకుల సెలవులు నిర్ణయించబడతాయి. ఈ ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

బ్యాంకులు మూసి ఉన్నా, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. నగదు డిపాజిట్ కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేక మెషిన్లు కూడా అందుబాటులో ఉంచుతాయి. ఏటీఎంలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి నగదు తీసుకోవడంలో సమస్య ఉండదు. ఇక ఏప్రిల్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉందో వివరంగా చూద్దాం:

ఏప్రిల్ నెలలో బ్యాంకుల సెలవులు:

ఏప్రిల్ 1 – వార్షిక ఖాతాల సర్దుబాటు కారణంగా బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో బ్యాంకుల సెలవు.

ఏప్రిల్ 6 – ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.

ఏప్రిల్ 8 – రెండో శనివారం సెలవు.

ఏప్రిల్ 10 – మహావీర్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవు.

ఏప్రిల్ 13 – ఆదివారం సెలవు.

ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి, బిహు, తమిళ సంవత్సరం సందర్భంగా బ్యాంకుల సెలవు.

ఏప్రిల్ 15 – బెంగాలీ న్యూ ఇయర్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవు.

ఏప్రిల్ 18 – గుడ్‌ఫ్రైడే సెలవు.

ఏప్రిల్ 20 – ఆదివారం సెలవు.

ఏప్రిల్ 21 – త్రిపురలో గరియా పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 26 – శనివారం సెలవు.

ఏప్రిల్ 27 – ఆదివారం సెలవు.

ఏప్రిల్ 29 – హిమాచల్ ప్రదేశ్‌లో భగవాన్ పరశురామ్ జయంతి సెలవు.

ఏప్రిల్ 30 – కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయ సెలవు.

అత్యవసర బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవారు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.