ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ వాట్సాప్ ఉపయోగిస్తూనే ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు వాడకంతో పాటు టెక్నాలజీ కూడా అదే రేంజ్లో పెరుగుతూ వస్తుంది. ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెంటనే సమాచారం తెలియడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం .. చివరకు మనీ ట్రాన్స్ఫర్ వరకూ అందుబాటులో ఉండటంతో వాట్సాప్ వినియోగించేవాళ్లు ఎక్కువవుతున్నారు.
నిజంగానే వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక కొన్ని పనులు మరింత ఈజీ అయ్యాయి. ఎవరికైనా ఏదైనా మెసేజ్ పంపాలంటే, దాన్ని టైప్ చేసి పంపాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ఆ మెసేజ్ ఎక్కువగా ఉంటే టైప్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా వాట్సాప్ కొత్త అప్ డేట్ ఇచ్చినా చాలామంది అది తెలియక వాయిస్‌తో మెసేజ్ టైపింగ్ చేయలేకపోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నా భారత్ లో ఈ సంఖ్యతక్కువగా ఉంది. వాట్సాప్‌లో చాట్ చేయడం కొన్నిసార్లు పెద్ద పెద్ద మెసేజులను టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా బయట ఉన్నప్పుడు, డ్రైవింగ్ లేదా ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు టైప్ చేయడం కష్టంగా మారుతుంది.
మీరు వాట్సాప్‌లో టైప్ చేయకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపే ఫీచర్ మీ వాయిస్ ఆధారంగా పని చేస్తుంది. అంటే మీరు మాట్లాడడం ద్వారా..అవతలి వారికి మీరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ను నోటితో చెప్పాలి. దీంతో మీరు చెప్పినది చెప్పినట్లుగా టైప్ అవుతూ ఉంటుంది.కాకపోతే దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ఇండిక్ కీబోర్డ్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది అన్ని భాషలకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు.