బిచ్చగాళ్లు,జేబు దొంగలను పంపించొద్దని వార్నింగ్

Warning Not To Send Beggars And Pickpockets,Warning Not To Send Beggars,Beggars And Pickpockets,Saudi Arabias Stern Message,Mango News,Mango News Telugu,Pakistans Beggars ,Beggars, Pickpockets,Saudi Arabia, Iraq, Headache For Saudi Arabia And Iraq,Arab Countries Ask Pakistan,Pakistans Beggars Latest News,Pakistans Beggars Latest Updates,Pakistans Beggars Live News,Saudi Arabia Latest News,Saudi Arabia Latest Updates,Saudi Arabia Live News,Saudi Arabia Warns Pak Latest News

ఎప్పటికపుడు తనదైన మార్కుతో గుర్తింపు తెచ్చుకోవడం పాకిస్తాన్‌కు అలవాటే. భారత్‌కు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అలాగే చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంటుంది. తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలోకి కొత్తగా బిచ్చగాళ్లు చేరారు.బిచ్చగాళ్ల ఎగుమతేంటి అని ఆశ్చర్యపోవద్దు. ఇది నిజం.సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇటీవల కాలంలో సౌదీ అరేబియాలో జేబు దొంగలు, ఇతర దొంగతనాలు చేసే వాళ్లు, బిచ్చగాళ్లను అరెస్టు చేస్తే.. వారిలో 90 శాతం మంది పాకిస్తాన్ జాతీయులే ఉన్నారట.

కొన్నాళ్లుగా పాకిస్తాన్ ఆర్దిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంది. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో పాటు ఆకాశాన్నంటుతున్న ఆహారం, ఇంధన ధరలతో పాకిస్తాన్‌లోని పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు కరెంట్ చార్జీలు కూడా బాగా పెరిగిపోయాయి. అంతెందుకు రంజాన్ నెలలో ఉచితంగా గోధుమపిండి పంపిణీ చేసే కేంద్రాల వద్ద..కేవలం గోధమపిండి కోసం తొక్కిసలాటలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనినిబట్టే పాకిస్తాన్ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు బాగోలేకపోవడంతో.. అక్కడ నుంచి బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో పశ్చిమాసియా దేశాలకు తరలి వెళుతున్నారు. విదేశీ పాకిస్థానీల స్టాండింగ్ కమిటీ కూడా ఆ మధ్య ఈ విషయాన్ని లేవ నెత్తింది. పశ్చిమాసియా దేశాల్లో నిర్బంధించబడిన మొత్తం, జేబుదొంగలు, బిచ్చగాళ్లలో తొంభై శాతం మంది పాకిస్థాన్‌కు చెందిన వారేనని విదేశీ పాకిస్థానీల స్టాండింగ్ కమిటీ చెప్పుకొచ్చింది. వీరంతా ఇరాక్, సౌదీ అరేబియాలోని జైళ్లలో బంధించబడ్డారని తెలిపింది. ఉమ్రా వీసాలపై తీర్థయాత్ర ముసుగులో ఈ పాకిస్థానీ జేబుదొంగలు, బిచ్చగాళ్లు విదేశాలకు వెళ్లి ఆ తర్వాత వీధుల్లో భిక్షాటనకు, దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇరాక్, సౌదీ అరేబియా రాయబారులు తెలియజేసినట్లు చెప్పారు.

మక్కా గ్రాండ్ మసీదు లోపల అరెస్టయిన జేబుదొంగలు, బిచ్చగాళ్లలోనూ ఎక్కువ మంది పాకిస్థానీ జాతీయులే అని తేలింది.10 మిలియన్ల మంది పాకిస్తానీ పౌరులు విదేశాల్లోనే ఉంటున్నారని..వీరిలో ఎక్కువమంది భిక్షాటనలో పాల్గొంటున్నారని విదేశీ పాకిస్థానీల స్టాండింగ్ కమిటీ చెబుతోంది. వీరంతా వీసాలు పొంది,ఇతర దేశాలలో భిక్షాటనను ఆశ్రయించడం, దొంగతనాలకు పాల్పడం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 1,6 లక్షల మంది పాకిస్థానీలు అలాగే ఖతార్‌లో 2లక్షల మంది పాకిస్థానీలు ఉన్నట్లు కమిటీకి సమాచారం అందింది. అంతేకాదు ఇరాక్, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు తమ జైళ్లు పాకిస్తాన్ బిచ్చగాళ్లు, జేబుదొంగలతోనే నిండిపోయినట్లు కమిటీ గుర్తించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =