ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో అంతా బిజీబిజీ షెడ్యూల్డ్ అయిపోయింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం అనుక్షణం ఆరాటపడే తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కుక్కర్లో ఇంత వండి పిల్లలకు పెట్టడం, అదే తామూ తినడంతో ఓ పని అయిపోయిందని అనుకుంటున్నారు.
పూర్వం నుంచి పెద్దవాళ్లు వాడే మట్టిపాత్రలను ఎప్పుడో మరిచిపోయారు. కనీసం స్టౌవ్ పై స్టీల్ గిన్నెలో అన్నం వండుకుని తిందామన్నా తినలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారికి తెలీకుండానే తమను, తమ పిల్లలను డేంజర్లోకి నెడుతున్నారనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ..లేనిపోని ఇరకాటంలో పడుతోన్నారు. కుదిరితే ఎలక్ట్రిక్ స్టవ్.. లేదంటే అల్యూమినియం స్టవ్ లో రైస్ వండుకుని తమకు తెలీకుండానే రోగాల పాలవుతున్నారు.
రైస్ కుక్కర్ లో అన్నం వండితే విషంగా మారుతుందని తాజాగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు. ఆహారం వండేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. అలా లేకపోతే ఆహారం హానికరంగా మారుతుంది. అయితే ఇక్కడ హాని కలిగించే అంశాలు కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటిది తక్షణమే పనిచేస్తుంది దీనిని ఫుడ్ పాయిజిన్ అని అంటారు. మరొకటి శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది. దీంతో ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
అల్యూమినియం పాత్రల్లో వండితే ఉదర సంబంద సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల వాతం, డయాబెటిస్ ,గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమం. ఇప్పటికే చాలామంది మిల్లెట్స్, చిరుధాన్యాలు తినడం, పాత కాలపు పద్ధతులు ఆచరించడం వంటివి చేస్తూ బ్యాక్ టూ ఓల్డెన్ డేస్ అంటున్నారు. మీరు అంతదూరం వెళ్లకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే జీవన ప్రమాణాలను కాస్త పెంచుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ