
ఆభరణాలను స్టేటస్ సింబల్‌గా కొంతమంది ధరిస్తే.. ఇష్టంతో మరికొంత మంది ధరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మంది బంగారంతో వేసిన జ్యువెలరీ వేసుకుంటే..ధనికులు మాత్రం వజ్రాలు, ప్లాటినమ్ వంటవి వేసుకుంటారు. మరికొద్ది మాత్రం వెండివి కూడా వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే వీటన్నిటికంటే కూడా రాగిని ఆభరణాలుగా వేసుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు. జ్యోతిష శాస్త్రంలో కూడా రాగి ఉంగరాన్ని ధరించడం మంచిదని చెబుతారు.
రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి లోహాన్ని సూర్యుడు, అంగారకుడి లోహంగా పరిగణిస్తారు. రాగి ఉంగరాలు, బ్రాస్ల్ లెట్ వంటివి ధరించేవారిలో వారు ధరించే రాగి.. సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది. రాగి కడియాలు , ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి నరాల సంబంధిత జబ్బులు చాలావరకు తగ్గుతాయి. అలాగే ఉదర సమస్యలు కూడా దూరమవుతాయి.
ఆర్థరైటిస్ రోగులు తప్పనిసరిగా రాగి కంకణాన్ని ధరిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే సూర్య, అంగారక దోషాలు ఉంటే అవి రాగి ఆభరణాలు ధరించడం వల్ల తొలగిపోతాయట. ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్య దోషం తొలగిపోతుంది. సూర్యునితో పాటు, అంగారక గ్రహం దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరగడమే కాకుండా.. రక్తం కూడా శుభ్రపడుతుందట.
రాగిని ఆభరణాలుగా ధరించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒకవేళ రాగిని ఆభరణాలుగా ధరించడానికి ఇష్టపడని వాళ్లు.. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగినా మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే రాగి వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయట. ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఇంట్లోవారి ఆనందాన్ని పెంచి, శాంతిని కాపాడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. రాగి స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక దిశలో ఉంటే..ద్వారానికి ఒక రాగి నాణేన్ని వేలాడదీస్తే వాస్తు దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE