పచ్చబొట్టు మన పూర్వం నుంచీ చూస్తున్నా కూడా మారుతున్న ట్రెండ్ తగ్గట్లు రూపురేఖలు మార్చుకున్న అది టాటూ రూపంలో యూత్ మనసులను కొల్లగొట్టేస్తుంది. ఒక్క యూత్ అనే కాదు మిడిల్ ఏజ్ వాళ్లు కూడా రకరకాల అర్ధాలు వచ్చేలా, వివిధ రకాల డిజైన్స్, మోడల్స్, కలర్స్‌తో టాటూ వేసుకుంటూ కనిపిస్తున్నారు. చేతిమీదే కాదు నడుము, పొట్ట , చెస్ట్, మెడ ఇలా సబ్బుబిల్ల, కుక్కపిల్లా కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా.. శరీరంలో తమకు నచ్చిన చోట్లలో టాటూలు వేయించుకుంటున్నారు. మరికొంత మంది అదే స్టేటస్ కు సింబల్ గా కూడా తమ బాడీలో చేర్చుకుంటున్నారు.
ఒకప్పుడు టాటూ లకు కాస్త దూరంగానే ఉండే యూత్.. ఈ మధ్యకాలంలో మాత్రం టాటూ వేసుకోవడం అనేది ఒక స్టైలిష్ కల్చర్ అనుకుంటున్నారు. తమకు నచ్చిన డిజైన్ ను టాటూగా వేయించుకుంటూ..అలా టాటూలు వేసుకుంటే ఇంకా స్టైలిష్ గా కనిపిస్తామని నమ్ముతున్నారు. అయితే ఎక్కడో కొంతమంది మాత్రమే చేతికో కాలికో టాటులు వేయించుకుంటుంటే..చాలామంది చూడటానికి కూడా భయంకరంగా ఉండేలా ఒళ్లంతా వేయించుకుంటున్నారు. అయితే టాటూలు వేసుకుంటే ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా.. లేదా అన్న విషయం అసలు పట్టించుకోరు.
ఇలాంటి వారందరికీ ఓ పిడుగులాంటి వార్తను వినిపిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టాటూలు వేయించుకోవడం వల్ల ఏకంగా బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. తాజాగా..టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% ఎక్కువగా ఉంటుందని స్వీడన్ సైంటిస్టులు వెల్లడించారు. 20 నుంచి 60 ఏళ్ల వయస్సున్న 11వేల మందిపై అధ్యయనం చేసిన సైంటిస్టులు.. ఈ విషయాన్ని వివరించారు.
చర్మంపై టాటూ ఇంకు పడగానే.. మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రభావానికి గురవుతుందని స్వీడన్ సైంటిస్టులు చెబుతున్నారు . చర్మం ద్వారా ఇంక్ లింప్ నోడ్స్ లో పేరుకుపోయి.. చివరికి లింపోమా క్యాన్సర్‌కు దారి తీయోచ్చు అని అంటున్నారు . అయితే చిన్నచిన్న టాటూలు వేసుకున్నవారిలో పెద్దగా ప్రభావం లేకపోయినా.. టాటూ సైజును బట్టి ఈ తీవ్రత పెరిగినట్లు తాము గుర్తించామని వివరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో టాటూల ప్రభావంపై మరిన్ని పరిశోధనలు జరుపుతామని నిపుణులు చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY