ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి పొందే జీతంలో కొంత భాగాన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు. ఈ డబ్బు వ్యక్తికి ఆర్థిక భద్రతను అందిస్తుంది అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీరు ఎన్ని కంపెనీల్లో పనిచేసినా అన్ని కంపెనీలు దాదాపుగా ఈ PF మొత్తాన్ని కట్ చేస్తాయి. కాబట్టి మీకు వచ్చే జీతంలో ఎంత డబ్బు కట్ అవుతుంది, మీ ఖాతాలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బు ఎంత అని తెలుసుకోవాలనే వారు పద్ధతి ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు.
మీకు PF ఖాతా , UAN నంబర్ ఉంటే, మీరు EPFO వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అయితే యూఏఎన్ నంబర్ తెలియకపోతే ఎలా తెలుసుకోవాలో తెలుసా? UAN నంబర్ లేకుండా PF డబ్బు గురించి సమాచారం తెలుసుకోవడానికి కింది విధంగా చేయండి.
PF ఖాతాదారులకు UAN నంబర్ ఇవ్వబడుతుంది. మీకు ఈ UAN నంబర్ ఉంటే, మీరు UMANG యాప్ లేదా EPFO ద్వారా మీ ఖాతాను నమోదు చేసుకోని తనిఖీ చేయవచ్చు. చెల్లించిన మొత్తం, పీఎఫ్ వడ్డీ సహా అన్ని వివరాలను చెక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే యూఏఎన్ నంబర్ తెలియకపోతే ముందుగా మీరు మీ PF ఖాతాలో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ తర్వాత మీకు EPFO నుండి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ లో మీరు చివరి PP చెల్లింపు ఖాతా వివరాలు, బ్యాలెన్స్ గురించి తెలుసుకుంటారు. PP బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ఇది చాలా సులభమైన మార్గం.
మీరు మీ మొబైల్ నంబర్‌ను పీఎఫ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. మొబైల్ నంబర్ UAN నంబర్‌తో లింక్ చేయబడుతుంది. అంతే కాదు కేవైసీ చేయాలి. కనీసం ఒక KYC పూర్తి చేయాలి. ఆధార్, పాన్ నంబర్‌తో సహా KYC పూర్తి చేసిన తర్వాత, మిగిలిన ప్రక్రియ సులభం. ఇదిలావుంటే, మీరు మిస్డ్ కాల్ నంబర్‌కు కాల్ చేస్తే, అది 2 రింగ్‌ల తర్వాత వెంటనే కట్ అవుతుంది, ఆ తర్వాత PF ఖాతా సమాచారం అందుబాటులో ఉంటుంది.
బ్యాలెన్స్‌ని కాల్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా మెసేజ్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 7738299899కి మెసేజ్ చేయడం ద్వారా పీఎఫ్ ఖాతా సమాచారం అందుబాటులో ఉంటుంది. EPFOHO UAN ENG అని టైప్ చేసి సందేశాన్ని పంపండి. అంతే కాదు, మీరు EPFO పోర్టల్ మరియు UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా PP ఖాతా మరియు ఇతర సమాచారాన్ని కూడా తనిఖీ చేయవచ్చు.