విమానంలో ఒక్కసారి అయినా ప్రయాణించాలని చాలామంది కలలు కంటారు. అయితే, ప్లైట్ ట్రావెలింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో చాలామంది వెనుకడుగు వేస్తారు. మరోవైపు విమానయాన రంగంలో భారీగా పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడటానికి, ప్రయాణికులను తమవైపు తిప్పుకోవడానికి విమానయన సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. బెస్ట్ సర్వీస్ ఇస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు కుమ్మరిస్తూ తక్కువ ఛార్జీలకే తమ తమ గమ్యాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి.
అలా తన ప్రయాణీకుల కోసం గొప్ప ఆఫర్‌లను అందించడంలో ముందుండే ఇండియలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇండిగో .. మరోసారి ‘గెట్‌వే సేల్’ని ప్రకటించింది. దీనిలో దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణికులకు రాయితీలను కల్పిస్తున్నారు. ఈ సేల్ ఈ నెల 31తో ఎండ్ అవుతోంది. సామాన్య ప్రయాణికుల కోసం ఇండిగో ఎయిర్‌లైన్స్ తీసుకొచ్చిన బంపర్ ఆఫర్ తో.. క్రిస్మస్‌ను జరుపుకోవడానికి ప్రత్యేక గెట్-అవే సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా, టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి దేశీయ మార్గాల్లో కనీసం రూ. 1199కి విమాన ప్రయాణం,అలాగే అంతర్జాతీయ మార్గాల్లో కనీసం రూ. 4,499కి విమాన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి నిజంగానే ఇదిగొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇది కాకుండా, ఇండిగో కొన్ని 6E యాడ్-ఆన్‌లపై 15 పర్సంట్ వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ప్రీపెయిడ్ యాక్సెస్ బ్యాగేజీ ఎంపికలు అంటే 15కేజీలు, 20కేజీలు, 30కేజీలు, ప్రామాణిక సీటు ఎంపిక, ఎమర్జెన్సీ ఎక్స్ ఎల్ సీట్లు వంటి వాటిపై కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఈ యాడ్-ఆన్‌ల ధర నేషనల్ ఫ్లైట్స్ కు రూ.599, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు రూ.699 నుంచి ధర ప్రారంభమవుతుంది. బుకింగ్‌లపై మరిన్ని సేవింగ్స్ కోసం ఇండిగో ఫెడరల్ బ్యాంక్‌తో కలిసి వర్క్ చేసింది.
మీరు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫ్లైట్ బుక్ చేసుకుంటే, మీకు నేషనల్ ఫ్లైట్స్ లో 15శాతం తగ్గింపు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో 10శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం హాలిడే ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం అనే చెప్పొచ్చు. ఈ టిక్కెట్ బుకింగ్ కోసం ఇండిగో వెబ్‌సైట్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు.