బంగారం వింటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గోల్డ్ ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారిపోవడంతోనే బంగారం కొనేవాళ్లు మాత్రం ఎప్పటికీ కొంటూనే ఉన్నారు. దీంతో పసిడి ధరలు రోజురోజుకు చుక్కలను తాకుతున్నాయి. కొన్నేళ్లుగా బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. కాగా 2024 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 1 గ్రాము 9,192 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర 1 గ్రాము 8,426 రూపాయలుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 6,895 రూపాయలుగా ఉంది. బంగారంతో పాటు వెండికి కూడా డిమాండ్ భారీగానే పెరిగింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 84,260 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల ధర 91,920 రూపాయలుగా ఉంది.విశాఖపట్నం, విజయవాడ, ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కాగా హైదరాబాద్‌లో కిలో వెండి ధర 1,12,900 వందలు రూపాయలుగా.. విజయవాడ, విశాఖపట్నంలోనూ 1,14,100 రూపాయలుగా ఉంది.