ఆగని పుత్తడి పరుగులు..

పసిడి ధరలు సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైపైకి ఎగబాకుతూ పసిడిని ముట్టుకోవాలన్నా దడ పుట్టేలా చేస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు..దేశీయ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఆల్‌టైమ్‌ రికార్డుకు పరుగులు తీస్తూ రూ.91 వేలను సమీపించింది.

కాగా ఈ రోజు అంటే మార్చి 21 కూడా మరికాస్త ఎగబాకిన పసిడి 24 క్యారెట్లు తులం 90వేల670 రూపాయలు ..గ్రాము ధర రూ.9,067కి చేరింది . ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 83,110 రూపాయలు ..గ్రాము ధర 8,311 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములుకు 68,001 రూపాయలు..గ్రాము ధర రూ.6,800 ధర పలుకుతుంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం బంగారం.. రూ.90,670, 22 క్యారెట్ల బంగారం తులం పుత్తడి 83,110 రూపాయలుగా ఉంది. గుంటూరులో 24 క్యారెట్ల బంగారం తులం 90,670 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం తులం 83,110 రూపాయలుగా ఉండగా.. విజయవాడ, ఖమ్మం వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాతున్నాయి.

మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి పోటీగా ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే లక్ష రూపాయల మార్కు దాటేసిన వెండి ధర.. తాజాగా మరికాస్త పెరిగింది. వెండి కిలో ధర గురువారం 1,05,100 రూపాయలు ఉండగా.. ఈ రోజు వందరూపాయలు పెరిగి 1,05,200 రూపాయలకి చేరింది. అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.