బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో కొద్దిరోజులుగా గందరగోళం నెలకొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి.దీనిలో భాగంగానే బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచంలో ఉన్న బంగారం ధరలపై మాత్రమే కాదు.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో ఆధారపడి కూడా ఉంటాయి. అయితే కొద్దిరోజులుగా వరుస షాకులిస్తున్న బంగారం , వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ లో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 87వేల540 ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పుత్తడి ధర రూ. 95వేల500లుగా కొనసాగుతోంది. అయితే ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళ, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, పొద్దుటూరులలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కాగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ ధర 22 క్యారెట్ల ధర రూ. 87వేల690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 95,650లుగా ఉంది.
మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఈరోజు తగ్గాయి. కాగా హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1లక్షా9వేల800ల రూపాయలుగా కొనసాగుతోంది. ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ కొంత మేర దిగి రావడంతో సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది కొద్దిగా ఇలాగే ధరలు తగ్గితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.