దేశంలో గత కొద్ది వారాలుగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ తో పాటు దీపావళి కూడా తోడవడంతో డిమాడ్ విపరీతంగా పెరిగింది. అయితే దీపావళి నిన్ననే అయిపోవడంతో ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7000 తగ్గింపును నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7385, ముంబైలో రూ.7385, దిల్లీలో రూ.7400, కలకత్తాలో రూ.7385, బెంగళూరులో రూ.7385, కేరళలో రూ.7385, వడోదరలో రూ.7390, జైపూరులో రూ.7400, లక్నోలో రూ.7400, మధురైలో రూ.7385, మంగళూరులో రూ.7385, నాశిక్ లో రూ.7388, అయోధ్యలో రూ.7400, బళ్లారిలో రూ.7385, గురుగ్రాములో రూ.7400, నోయిడాలో రూ.7400గా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,560, 22 క్యారెట్ల ధర రూ. 73,850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ.700, రూ.770 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ.770 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,710 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 74,000 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుటీముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ. 700, రూ. 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,560కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,850 వద్ద ৫০০ ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా? వెండి ధరలు బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు రూ. 3000 తగ్గింది. దాదాపు వారం రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తం వెండి ధర తగ్గడం ఇదే మొదటిసారి.
బంగారం ధరల పెరుగుదలకు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.