తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు శుభవార్త

Good News For Chicken Lovers In Telugu States

తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులు లొట్టలు వేసుకునే వార్త ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తోంది. కొందరికి సండే వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లు ఉంటారు .మరికొంత మంది ఛాన్స్ దొరకాలే కానీ వీక్ మొత్తం నాన్ వెజ్ అన్నా ఓ పట్టు పట్టేస్తారు.ఇలాంటివారికి అదిరిపోయే వార్త వినిపిస్తోంది.

సండే వచ్చిందంటే చాలామంది చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ల ముందు క్యూలు కడతారు. ఎక్కువమంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే కొంతకాలంగా చికెన్ ధరలు ఆకాశాన్నంటడంతో చాలామది జిహ్వ చాపల్యాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కొండెక్కిన చికెన్ ధరలతో.. చికెన్ ప్రియులు దానిని కొనలేక.. తినలేక కొట్టుమిట్టాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో ఎగిరి గంతేస్తున్నారు.

ఒకప్పుడు కేజీ చికెన్ 280 రూపాయల నుంచి 300 రూపాయలు వరకు ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర 220 రూపాయలు నుంచి 230 రూపాయలు గా ఉంది. అటు ఏపీలోనూ చాలా ప్రాంతాల్లో కేజీ చికెన్ 240 రూపాయలు వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు 117 రూపాయలు గా కొనసాగుతోంది. ఇక గుడ్డు ధర విషయానికొస్తే.. 12 కోడిగుడ్ల రిటైల్ ధర 70 రూపాయలు గా ఉంది. అలాగే ఒక్కో గుడ్డు రూ 6 రూపాయలుకు అమ్ముతున్నారు.