ఇప్పుడు ఎక్కడ చూసినా జుట్టు రాలడమనేది చాలామందికి ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. కొద్దిగా జుట్టు రాలితే పర్వాలేదు కానీ.. జుట్టు విపరీతంగా రాలడం మొదలయితే వాళ్ల ఆందోళన అంతా ఇంతా కాదు. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడానికి మార్కెట్లో వచ్చిన రకరకాల నూనెలు, హెయిర్ సీరం వంటి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు.ఇది మంచిదే కానీ ఇక్కడ చాలామంది గుర్తుంచుకోవాల్సింది ఒకటుందని నిపుణులు అంటున్నారు.
మనం తీసుకునే ఆహారం సరైనది కాకపోతే.. జుట్టును రాలిపోకుండా చేసే పోషకాల కొరత ఏర్పడుతుంది. అందుకే సరైన పోషక ఆహారం తీసుకుంటే, జుట్టు రాలడం అనే పెద్ద సమస్య నుంచి తప్పించుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడంతో పాటు అందమైన జుట్టు సొంతమవుతుంది. శరీరంతో పాటు జుట్టుకు విటమిన్ సీ, విటమిన్ ఈ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రకాల పండ్లలో కూడా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి. అయితే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, విటమిన్ C , విటమిన్ E ఎక్కువగా ఉండే బెర్రీలు, చెర్రీస్, నారింజ, ద్రాక్ష మొదలైన పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మీ స్కాల్ప్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.
అలాగే డ్రై ఫ్రూట్స్, సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతగానో సహాయపడతాయి. వాటిలో ప్రోటీన్, జింక్, సెలీనియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడటంతో పాటు.. జుట్టు రాలిపోవడాన్ని అడ్డుకుంటాయి. దీనికోసం వాల్‌నట్‌లు, బాదం, అవిసె గింజలు, చియా గింజలు రోజూ తినే ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకుంటే వాటిలో మూలకాలు జుట్టును బలపరుస్తాయి.
పండ్లలాగే ఆకు కూరల్లో కూడా జుట్టు రాలడాన్ని అడ్డుకునే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ, బచ్చలికూర, కొల్లార్డ్స్ వంటి కూరగాయలలో విటమిన్ A, ఫోలేట్, ఐరన్, బీటా కెరోటిన్, విటమిన్ C వంటి విటమిన్స్ ఉంటాయి. ఒక కప్పు బచ్చలికూరను కూరగా చేసుకుని తింటే దానివల్ల దాదాపు 6 mg ఐరన్ శరీరానికి దొరుకుతుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా.. బలమైన,ఆరోగ్యకరమైన జుట్టు సొంతం అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ