ప్రస్తుతం ఇయర్ ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతీ ఒక్కరి చేతిలో కవచాభరణంలా మొబైల్ ఉండడంతో, పాటలు వింటూనో, ఫోన్ మాట్లాడుతూనో ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే కనిపిస్తున్నారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదన్న వార్తలు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. నిజానికి రేడియేషన్ తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ మంచివే అయినా, వాటిని ఎక్కువ సమయం చెవిలో పెట్టుకోవడమే కరెక్ట్ కాదు. అది మిమ్మల్ని చెవిటివారిగా చేసే అవకాశం ఉంది.
ఎక్కువ సేపు పాటలు వినడం, కాల్ మాట్లాడడం వంటివి చేస్తుంటే వినికిడి సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చెవుల్లో ఇన్ఫెక్షన్ రావడమే దీనికి ప్రధాన కారణం. ఇయర్ ఫోన్స్ తరచుగా వాడడం వల్ల వినికిడి 40డెసిబుల్స్ నుంచి 50డెసిబుల్స్ కి తగ్గుతుంది. దూరం నుంచి వచ్చే శబ్దాలు వినడంలో ఇబ్బంది ఏర్పడి, చెవిటి సమస్యలకి దారితీస్తుంది. మీరు వాడే ఇయర్ ఫోన్లలో అధిక డెసిబుల్ సామర్థ్యం ఉంటుంది. వీటిని వాడుతూ ఉంటే వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. వీటిని ఎక్కువగా ఉపయోగించటం వలన గులిమి ఎక్కువగా ఏర్పడి చెవి హోరుకు కారణం కావచ్చు.చాలాసార్లు శాశ్వతంగా చెవిటివాళ్లు అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఇయర్ ఫోన్లు విడుదల చేసే విద్యుదయస్కాంత తరంగాలు దీర్ఘకాలంలో మెదడు సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే లోపలి చెవి మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్ కలిగి మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఇయర్ ఫోన్స్ ఇతరులతో పంచుకున్నప్పుడు శుభ్రపర్చకుండా వాడటం మంచిది కాదు.
షాపింగ్, వాకింగ్, బయట జాగింగ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బయట సౌండ్స్ వినబడవు. బండి మీద వెళ్లేటప్పుడు కూడా వీటిని ఉయోగిస్తున్నారు. వీటి కారణంగా ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏది ఏమయినా అతి అనర్థకమే అవుతుంది కాబట్టి.. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. రేడియేషన్ ను దూరం పెడదామని ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఇతర సమస్యలను కొనితెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY