జూన్ ఎండింగ్‌కు వచ్చినా తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతూనే ఉన్నాయి. వర్షాలు వచ్చినప్పుడు కాస్త ఊరటగా ఉన్నా వెంటనే వేడి, ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పటికీ చాలామంది ఏసీని ఉపయోగించకుండా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. అయితే కొన్ని సార్లు ఏసీ నుంచి గ్యాస్ లీకై ఏసీ పేలిపేయే ప్రమాదాల గురించి కూడా వింటున్నాము. అందుకే ఏసీ గ్యాస్ లీక్ అయ్యే సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ గ్యాస్ లీకయినట్లు గుర్తిస్తే.. వెంటనే రిపేర్ చేయడం వల్ల, నష్టం జరగకుండా అడ్డుకోవచ్చు.కరెంటును కూడా ఆదా చేయొచ్చు.
ఏసీ అంతకుముందులా చల్లదనాన్ని అందించకపోతే, ఎయిర్ కండీషనర్ నుంచి గ్యాస్ బయటకు వచ్చినట్లు అనుమానించవచ్చు. ఎందుకంటే గ్యాస్ పరిమాణం తగ్గినప్పుడు గదిని కూల్ గా ఉంచే సామర్థ్యం కూడా తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత అస్సలు కూలింగ్ కూడా ఇవ్వదు.అలాగే ఎయిర్ కండీషనర్ కాయిల్ లీక్ అయితే.. ఏసీ స్టార్ట్ అయినప్పుడు వింత శబ్దం వస్తుంటుంది. ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే ఒకలాంటి శబ్దం వస్తే ఏసీ కంప్రెషర్ పాడైపోతుందని లేదా ఏసీ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని అర్థం చేసుకోవాలి.
అలాగే ఏసీ యూనిట్ దగ్గర ఏదైనా దుర్వాసన వచ్చినా, వేడి గాలి వచ్చినా అప్పుడు కూడా గ్యాస్ లీక్ అవుతున్నట్లు సంకేతంగానే అనుకోవాలి. శీతలీకరణి వాయువు స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది. దీంతోనే చాలామంది గ్యాస్ లీకయినట్లు గుర్తిస్తారు. దీంతో పాటు కంప్రెసర్ స్టార్ట్ అయిన శబ్దం వినబడకపోయినా కూడా ఎయిర్ కండీషనర్ గ్యాస్ లీక్ అయిందని అర్థం చేసుకోవాలి.ఏసీలో ఇలాంటివి గుర్తించినట్లయితే వెంటనే ఏసీ టెక్నిషియన్‌ను పిలిచి రిపేర్ చేయించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY