రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌ విడుదల

Realme Narzo 60x 5G Smartphone Official Teaser Released Before Launching in India Soon,Realme Narzo 60x 5G Smartphone,Realme 5G Smartphone Official Teaser,Narzo Official Teaser Released Before Launching,Realme Narzo 60x 5G Smartphone in India Soon,Mango News,Mango News Telugu,Realme Narzo 5G,Realme New Smartphone, The design and specifications,Realme, Smartphone, Released, Narzo 60X,Realme Narzo Latest News,Realme Narzo Latest Updates,Realme Narzo Live News,Realme Narzo Official Teaser Latest News,Realme Narzo Official Teaser Live News

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌ విడుదల కానుంది. రియల్‌మీ సంస్థ ఇటీవల నార్జో 60, నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం Narzo 60X స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. టీజర్‌ ఆధారంగా నార్జో 60X స్మార్ట్‌ఫోన్‌.. భారత్‌లో ఇటీవల లాంచ్‌ అయిన రియల్‌మీ 11X 5G ఫోన్‌ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. రియల్‌మీ నార్జో 60X స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌పై పనిచేయనుంది.

రియల్‌మీ నార్జో 60X స్మార్ట్‌ఫోన్‌ వివిధ రకాల ర్యామ్‌, అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. అయితే కెమెరా విభాగంలో ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. 108MP లేదా 64MP ప్రధాన కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. టీజర్‌ ఆధారంగా రియల్‌మీ నార్జో 60X స్మార్ట్‌ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్యానల్‌ నార్జో బ్రాండింగ్‌ను కలిగి ఉంది. ఫోన్‌ కింది భాగంలో ఛార్జింగ్ పోర్టు ఉంది. దాంతోపాటు 3.5mm ఆడియో జాక్‌ సహా స్పీకర్ గ్రిల్‌ ఉంది. ఈ ఫోన్ రియల్‌మీ 11X రీబ్రాండెండ్‌ వెర్షన్‌గా రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతవారం రియల్‌మీ 11, రియల్‌మీ 11X స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మీడియాటెక్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OSతో పనిచేస్తున్నాయి. రియల్‌మీ 11 5G 108MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. అదే 11X 5G ఫోన్ 64MP ప్రధాన కెమెరాతో లాంచ్‌ అయింది.

రియల్‌మీ 11X స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రధాన కెమెరా+ 2MP సెకండరీ కెమెరా, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 11X 5G స్మార్ట్‌ఫోన్లు రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. 6GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.14,999గా ఉంది. అదే 8GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15,999 గా ఉంది. అయితే రియల్‌మీ నార్జో 60X స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు సహా ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ ఫోన్‌ ధర, ఇతర కెమెరా, అంతర్గత స్టోరేజీ వివరాలు వెల్లడికాలేదు. విడుదల తేదీపైనా రియల్‌మీ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 7 =