ఒకప్పుడు రోడ్ల మీద ఎక్కడో కాని కనిపించని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీలపై పలు డిస్కౌంట్లు ఇస్తూ వీటి అమ్మకాలను ప్రోత్సహించడంతో చాలామంది వీటిని తీసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఫ్యూచర్లో డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాల తయారీని కూడా తగ్గిస్తామని..కేవలం ఈవీల మీదే ఎక్కువ దృష్టి పెడతామని ఇప్పటికే కేంద్రం అనౌన్స్ కూడా చేసేసింది. అయితే ఇవి ఎక్కువ మైలేజ్ ను ఇవ్వవని..లాంగ్ జర్నీలు చేసేవాళ్లకు ఈవీలు సెట్ కావని కొంతమంది వీటిని కొనడానికి వెనుకడుగు వేస్తుంటారు. అలాగే వర్షాకాలం వీటిన చార్జ్ చేయడం కూడా చాలా కష్టమన్న వాదన కూడా ఉంది.
నిజానికి ఇండియాలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈవీ కార్లు ఈవీ బైక్స్, స్కూటర్లు ఎక్కువ మంది ప్రజలు వాడుతున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీతో పెట్రో కార్లతో పోటీగా ఈవీ కార్లు మైలేజ్ ఇస్తుండటంతో.. ఆ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కానీ అమ్మకాలు పెరిగినా ఈవీ కార్ల వినియోగదారులను మాత్రం కొన్ని అనుమానాలు వేధిస్తున్నాయి. అందులో మొదటిది బ్యాటరీ చార్జింగ్ కాబట్టి.. బ్యాటరీను వర్షం పడుతున్న సమయంలో చార్జ్ చేయొచ్చా..? అని గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. లాంగ్ రైడ్‌కు వెళ్లిన సమయంలో అనుకోకుండా వర్షం పడితే ఈవీ కారు చార్జింగ్ అనేది పెద్ద ప్రహసనంగా మారుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలనే ప్రశ్నలను నెట్టింట్లో అడిగి సమాధానాలు తెలుసుకుంటున్నారు.
నిజమే పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వర్షాకాలంలో వాటిని ఛార్జ్ చేయడం ఇంకా కష్టం అవుతుంది. ఏదైనా కంపెనీ తమ ఈవీలను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు అనేక దశల్లో టెస్టింగ్ చేశాక మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తారు. తమ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జర్లు, కనెక్టర్లను అన్ని రకాల వాతావరణంలో పని చేసేలా వాటిని తయారు చేస్తారు. దీంతో పాటు, వాటి నాణ్యతను కూడా అనేక రకాలు పరీక్షించాక కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయరు.అందుకే ఈవీ ఛార్జర్‌లు, కనెక్టర్‌లు పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి.దీంతో పాటు, వాటిని దుమ్ము, మట్టి లేదా ఇతర రకాల కణాల నుంచి రక్షించడానికి ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తారు.
ఎలక్ట్రిక్ కార్లలో, ఛార్జర్ వాటర్ ప్రూఫ్‌తో పాటు, ఆన్-బోర్డ్ సెన్సార్ల ద్వారా కూడా సేఫ్టీ రెట్టింపు అవుతుంది.అయితే కొన్ని కారణాల వల్ల ఛార్జర్‌లో సమస్య ఉంటే అది పరిష్కరించకపోతే మాత్రం కారులో అమర్చిన ఆన్-బోర్డ్ సెన్సార్లు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాయి. కానీ ఎప్పుడైనా సరే మీ కారును ఛార్జ్ చేయాలనుకుంటే డ్రైవింగ్ చేసిన వెంటనే కారును ఛార్జింగ్‌లో ఉంచవద్దన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ బాగా హీటెక్కుతుంది. అప్పుడు దానిని ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల ఇంకా బ్యాటరీ హీటెక్కుతుంది. వర్షాకాలంలో, ఛార్జింగ్ పెట్టాలనుకుంటే నేరుగా వాననీరు పడని ప్రదేశంలో కారును పార్క్ చేసి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే కవర్ పార్కింగ్ స్థలంలో..ఈవీని పార్కింగ్ చేసిన తర్వాత ఛార్జ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE