రూపే డెబిట్ కార్డ్‌ ఉందా అయితే ఈ బెనిఫిట్స్ మిస్ కావొద్దు..

Do You Know The Benefits of RuPay Debit Card Here's Get Details,Do You Know The Benefits of RuPay,Benefits of RuPay Debit Card,RuPay Debit Card Heres Get Details,Mango News,Mango News Telugu,RuPay Debit Cards,Jan Dhan Accounts , RuPay Debit Card benefits, Classic RuPay cards, Platinum RuPay cards, Select RuPay cards,Benefits of RuPay Latest News,Benefits of RuPay Latest Updates,Benefits of RuPay Live News

రూపే డెబిట్ కార్డ్‌..దీనికి ఇండియాలోనే కాదు..వేరే దేశాల్లో కూడా క్రేజ్ లభిస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం రూపే ప్లాట్‌ఫామ్‌పై ఇండియాలో ప్రారంభమైన డెబిట్ కార్డులు ఇప్పుడు చాలామంది బ్యాంకు కస్టమర్లకు సుపరిచితమే. గ్లోబల్ కార్డ్ నెట్వర్క్స్ అయిన విసా, మాస్టర్‌కార్డ్‌లకు ధీటుగా రేపే కార్డులు కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డులు చాలా పాపులర్ అయ్యాయి. రీసెంటుగానే రూపే క్రెడిట్ కార్డులకు యూపీఐ ఫెసిలిటీ కూడా ప్రారంభమైంది. అంతేకాదు భూటాన్, సింగపూర్, యూఏఈ, నేపాల్ వంటి దేశాలకు ఈ రూపే కార్డ్ సర్వీసులు విస్తరించాయి.

ప్రస్తుతం ఈ రూపే కార్డులను సుమారు 1,100 ప్రభుత్వ, ప్రైవేట్, రీజనల్ రూరల్, కోఆపరేటీవ్ బ్యాంకులు జారీ చేస్తున్నాయి. ఇండియాలో 67 కోట్లకు పైగా రూపే డెబిట్ కార్డులు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో 33 కోట్లకు పైగా రూపే కార్డులు జన్ ధన్ అకౌంట్లకు ఇచ్చినవేనట. నిజానికి ఈ జన్ ధన్ అకౌంట్‌హోల్డర్స్ రూపే డెబిట్ కార్డ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ కార్డు వల్ల రూ.2 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో పాటు డిసెబిలిటీ కవరేజీ కూడా ఉంటుంది. ప్రస్తుతం క్లాసిక్, ప్లాటినం, సెలెక్ట్ పేరుతో రూపే కార్డులు అందుబాటులో ఉన్నాయి.

రూపే క్లాసిక్ కార్డును నిజంగానే బేసిక్ కార్డుగా చెప్పుకోవచ్చు. ఈ కార్డును ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు.. పీఓఎస్ మెషీన్లలో ఉపయోగించొచ్చు. జారీ చేసిన బ్యాంకును బట్టి ఈ లిమిట్స్ ఉంటాయి. అలాగే రూపే ప్లాటినం డెబిట్ కార్డులో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్ పే, స్విగ్గీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కార్డు ద్వారా ఆఫర్స్ పొందొచ్చు. అంతేకాదు డొమెస్టిక్ రైల్వే స్టేషన్స్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ కార్డు ద్వారా రూ.2 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ గానీ పర్మనెంట్ డిసెబిలిటీ కవరేజ్‌ కానీ లభిస్తుంది.

అలాగే రూపే సెలెక్ట్ కార్డును ప్రీమియం కార్డుగా చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. డొమెస్టిక్ రైల్వే స్టేషన్స్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ తో పాటు.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో లాంజ్ యాక్సెస్‌ కలిగి ఉండటంతో పాటు.. 20 పైగా ప్రీమియం గోల్ఫ్ కోర్స్‌లల్లో కాంప్లిమెటరీ గోల్ఫ్ గేమ్ యాక్సెస్ కూడా ఈ కార్డుతో లభిస్తుంది. అంతేకాదు కాంప్లిమెంటరీ ప్రివెంటీవ్ హెల్త్ చెకప్స్ ఈ కార్డుతో పొందొచ్చు. అలాగే జిమ్ మెంబర్‌షిప్ పొందే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు ఓటీటీ బెనిఫిట్స్ రూపే సెలక్ట్ కార్డుతో పొందొచ్చు. అంతేకాదు రూ.10 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, పర్మనెంట్ డిసెబిలిటీ కవరేజీ కూడా లభిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − one =