వంటింట్లో ఉండే ఈ చిన్న మసాలా పదార్థం అయిన లవంగాలు ఒంట్లోని ఎన్నో సమస్యల్ని దూరం చేస్తాయి. ఉదయాన్నే హెల్దీగా ఏదైనా డ్రింక్ తీసుకోవాలనుకున్నవారు.. లవంగాలతో తయారుచేసిన డ్రింక్ తీసుకుంటే చాలా లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
లవంగాలని రాత్రంతా నానబెట్టి.. ఈ నీటిని తాగాలి. ఈ లవంగాల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి.పెరుగుతున్న కాలుష్యంతో చాలా మంది ఊపిరితిత్తుల్లో ఆ చెత్త పేరుకుపోవడంతో పనితీరు తగ్గుతుంది. కానీ, మనం ఈ లవంగాల నీరు తాగితే ఊపిరితిత్తుల్లోని పేరుకుపోయిన చెత్త అంతా బయటికి వచ్చి.. శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి.
తరచూ యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే రాత్రంతా లవంగాలను నానబెట్టి ఆ నీటిని తాగితే.. లవంగాల నీరు డైజెస్టివ్ సిస్టమ్‌ని ప్రేరేపిస్తుంది. దీంతో మనం తీసుకున్న ఆహారం త్వరగా విచ్ఛిన్నమవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటివి దూరమవటంతో పాటు గట్ హెల్త్ బాగుంటుంది.
మనం తీసుకునే ఫుడ్, ఇతర కారణాల వల్ల చాలా మంది దంతక్షయం, పంటినొప్పి, చిగుళ్ల నొప్పి వంటి ఇతర సమస్యలొస్తాయి. అలాంటప్పుడు ఈ లవంగాల నీరు ఆ సమస్యలని తగ్గిస్తాయి. లవంగాల నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండటం వలన.. లవంగాల నీటిని రెగ్యులర్ రగా తాగితే నోటి దుర్వాసన, దంతక్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ వంటివి దూరమవుతాయి. ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది.
బరువు తగ్గడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారు ఈ లవంగాల నీటిని తాగితే మెటబాలిజం పెరిగి బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. దీనిలోని కాంపౌండ్స్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేస్తాయి. దీంతోపాటు ఎంత ఇష్టమైన ఆహారాలు అయినా సరే వాటిని తినాలన్న క్రేవింగ్స్ లేకుండా చేస్తాయి.
సీజన్ మారినప్పుడల్లా బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో రకరకాల సమస్యలు వస్తాయి. అయితే, ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ గుణాలున్న లవంగాల నీటిని తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. రెగ్యులర్‌గా తీసుకుంటే సీజనల్‌గా వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చట.