చాలామంది అమ్మాయిలు గోళ్లను పెంచుకోవడాన్ని ఇష్టపడతారు. గోళ్లను మరింత అందంగా ఉంచుకోవడానికి రకరకాల నెయిల్ పాలిష్‌లు వేసుకుంటూ ఉంటారు. అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటే మంచిదని కొంతమంది..కాదు కాదు నెగిటివ్ ప్రభావాలు ఉంటాయని మరకొంతమంది అంటుంటారు. అయితే దీనిపై నిపుణులు మాత్రం నెయిల్ పాలిష్ వల్ల రెండు ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.
నిజానికి గోళ్లకు కలర్ వేస్తే..అది గోళ్లతో పాటు వారి చేతులను కూడా అందంగా మారుస్తుంది. గోళ్లకు నెయిల్ పాలిష్ కానీ, నెయిల్ ఆర్ట్ ఉంటే.. అది వారి చేతులకు మరింత అందాన్ని ఇస్తుంది. నెయిల్ పాలిష్ వేయడం ద్వారా చేతులు శుభ్రంగా, అందంగా కనిపిస్తాయి. అందుకే అమ్మాయిలు వారి నెయిల్స్‌కి రకరకాలుగా నెయిల్ ఆర్ట్, నెయిల్ పాలిష్‌లు వేసుకుంటారు.
గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచి అలవాటుగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల.. ఆ నెయిల్ పాలిష్ పొట్టలోకి వెళుతుందని ఈ అలవాటును చాలామంది మానుకుంటారు. నెయిల్ పాలిష్‌తో గోళ్లు పెరుగుతాయా అంటే కొంతమందికి నెయిల్ పాలిష్ వేుకోవడం ఉపయోగకరంగానే ఉంటుంది. ఎందుకంటే నెయిల్ పాలిష్ కాస్త థిక్ నెస్‌ను ఇవ్వడం వల్ల.. గోళ్లు త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. మరీ డెలికేట్ ఉన్నవాళ్లకు మాత్రం నెయిల్ పాలిష్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
గోళ్లను అందంగా మార్చడంలో నెయిల్ పాలిష్ ఉపయోగపడినా.. దీనిని ఎక్కువగా అప్లై చేస్తే గోళ్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నెయిల్ పెయింట్‌లో రసాయనాలు ఉండటం వల్ల ఇవి గోళ్లను బలహీనంగా మారుస్తాయి. దీనివల్ల గోళ్లు త్వరగా విరిగిపోతుంటాయి. అలాగే రోజూ నెయిల్ పాలిష్ వేస్తే దాని నుంచి వెలువడే వాసనతో కొందరిలో ఊపిరితిత్తులు పాడవడంతో పాటు మరికొందరికి దీనివల్ల అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు నెయిల్ పాలిష్ వల్ల చర్మం పొడిగా మారి వేళ్లకు దురదలు వస్తాయి. నెయిల్ పాలిష్‌ను వేసుకుంటే .. అది గోళ్లకు సహజంగా ఉంటా మెరుపును తగ్గిస్తుంది. తక్కువ రకం క్వాలిటీ ఉన్న నెయిల్ పాలిష్ వాడేవారిలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. బ్రాండెడ్ నెయిల్ పాలిష్‌లలో రసాయనాలు ఉండవు. అలాగే వీలయినంత వరకూ గోళ్లను గాలి తగిలేటట్లు ఉంచితేనే మంచిదని..మరీ అవసరం అయితే తప్ప గోళ్లకు రంగు వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.