జన్యువుల పుట్టుక 65 కోట్ల ఏళ్ల క్రితమే జరిగిందట..

Britain The Scientists of Leicester University Says That The Birth of Genes Happened 65 Million Years Ago,Britain The Scientists of Leicester University,The Birth of Genes Happened 65 Million Years Ago,The Birth of Genes,Mango News,Mango News Telugu,Leicester University Says Birth of Genes,Birth of Genes 65 Million Years Ago,The Scientists of Leicester University News Today,birth of genes, Genes involved in learning, memory, aggression, and other complex , UK, University of Leicester,Leicester University Latest News,Leicester University Latest Updates

మనిషిలో ఉండే ఏదైనా నేర్చుకునే గుణం, జ్ఞాపకశక్తి , మనిషిలో ఉండే దూకుడుతనం, ఇతర సంక్లిష్టమైన వ్యవహారశైలికి సంబంధించిన జన్యువులు ఇప్పటివి కాదని.. ఇవన్నీ చాలా అంటే చాలా పురాతనమైనవని శాస్త్రవేత్తలు చెప్పారు. అవి 65 కోట్ల ఏళ్ల కిందటే పుట్టుకొచ్చాయని.. బ్రిటన్‌లోని లీసెస్టర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ సంగతిని తేల్చారు.

అడ్రినలిన్‌ ,సెరోటోనిన్‌, డోపామైన్‌, వంటి మోనో అమైన్లు నాడీ వ్యవస్థలో.. న్యూరోట్రాన్స్‌మీటర్లుగా పని చేస్తుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే.. నాడీ కణాల మధ్య రసాయన సంకేతాలను బట్వాడా చేస్తుంటాయన్న మాట. ఈ మూలకాలు మనిషిలో ఉండే ఏదైనా నేర్చుకునే గుణం, జ్ఞాపకశక్తి , మనిషిలో ఉండే దూకుడుతనం, ఇతర సంక్లిష్టమైన వ్యవహారశైలికి సంబంధించిన అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అంతెందుకు నిద్ర, ఆహారం తీసుకోవడం వంటి పనులను నిర్వర్తించడంలోనూ వీటిది ప్రధాన పాత్రే ఉంటుంది.

అయితే మోనో అమైన్ల ఉత్పత్తి, నిర్ధారణ, క్షీణతకు ఎలాంటి జన్యువుల మూలాలు అవసరం అవుతాయో అన్నదానిపై శాస్త్రవేత్తలు ఎవరూ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా తేల్చుకునేందుకు..కంప్యూటేషనల్‌ విధానాలతో ఈ జన్యువుల చరిత్రను శాస్త్రవేత్తలు పునర్నిర్మించారు. దీంతో మోనోఅమైన్‌ ఉత్పత్తిలో సంబంధమున్న జన్యువుల మూలాలు.. బైలేటరియన్‌ స్టెమ్‌ గ్రూపులో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

నిజానికి బైలేటేరియన్లు అనేవి శారీరకంగా ఎడమ, కుడి పార్శ్వాలు కలిగిన జీవులట. బైలేటేరియన్లు రెండు భాగాలు కూడా ఒకేలా ఉంటాయట. దీన్ని బట్టే మోనో అమినెర్జిక్‌ వ్యవస్థను.. 65 కోట్ల ఏళ్ల కిందట ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితంగా తేల్చారు. దీంతో పాటు సంక్లిష్ట వ్యవహారశైలికి సంబంధించిన మరిన్ని అంశాల మూలాలను కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =