పురాతన వస్తువులే కాదు..పాత నాణేలు, పాత కరెన్సీ వల్ల చాలా మంది కోట్లకు పడగలెత్తుతారన్న వార్తలు వింటూ ఉంటాం. పురాతన వస్తువులకు అంత డిమాండ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మీదగ్గర పాత 5 రూపాయల నోటు ఉంటే.. మీరు ఇంట్లో కూర్చొని కోటీశ్వరులు అవ్వొచ్చు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఓ ఫోటో తీసి అప్‌లోడ్ చేయడమే. పాత 1 రూపాయి కాయిన్, రెండు రూపాయల కాయినా కూడా మీరు పది కోట్లు మీ సొంతం చేసుకోవచ్చు.
మీరు చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న కరెన్సీకి నిర్దిష్ట స్పెసిఫికేషన్‌లు ఉన్నాయా లేదా అని చూడటమే. 1885లో ముద్రించిన రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే.. పది కోట్లు సంపాదించొచ్చు . ఇలాంటి నాణెం ఈ ఏడాది పది కోట్లకు అమ్ముడుపోయింది. దీని కోసం ముందుగా ఇండియా మార్ట్ అధికారిక వెబ్‌సైట్ www.indiamart.com కి వెళ్లాలి. మీ పాత నాణెం లేదా 5 రూపాయల నోటును ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. దీంతో ఆసక్తి గల పార్టీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. మీరు నేరుగా పార్టీతో డీల్ మాట్లాడి డబ్బులు ఫైనల్ చేసుకోవచ్చు.
అయితే పాత నోట్లు లేదా నాణేల ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. కొన్ని అసాంఘిక శక్తులు ఆర్బీఐ పేరును, లోగోను ఉపయోగించి కమీషన్, చార్జీలు, వస్తువుల విక్రయానికి సంబంధించిన ట్యాక్సులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఇలాంటి లావాదేవీలపై కమీషన్ లేదా పన్నును తాము ఎప్పుడూ అడగబోమని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.
కాయిన్‌బజార్ వంటి వెబ్ సైట్లు కూడా పాత , అరుదైన నాణేలను విక్రయిస్తుంటాయి. ఇక్కడ వినియోగదారులు పేరు, చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్ మొదలైన ప్రాథమిక వివరాలను నమోదు చేసి మీ పేరు వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారికి కావాల్సిన కాయిన్ మీ దగ్గర ఉంటే మీ వివరాలను అందులో ఎంటర్ చేస్తే.. వారే మిమ్మల్ని సంప్రదించి ఎక్కువ మొత్తంలో ధర చెల్లిస్తారు.