వాట్సాప్ వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా యూపీఐ లైట్ అనే ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది.
వాట్సాప్ కంపెనీ తన పేమెంట్ సిస్టంను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, యూజర్స్ కోసం యాప్‌కు యూపీఐ లైట్ ఫీచర్‌ను కూడా జోడించాలని యోచిస్తోంది. వాట్సాప్ యూపీఐ లైట్ ఫీచర్ యాప్‌కు జోడించిన తర్వాత ఈ కొత్త ఫీచర్ గూగుల్ పే, పేటీఎమ్, ఫోన్ పే వంటి యాప్‌లతో పోటీ పడబోతుంది.
యూపీఐ లైట్ ఫీచర్ వాట్సాప్.. బీటా వెర్షన్ v2.25.5.17 లో కనిపించింది. అయితే ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అప్‌డేట్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే యూపీఐ లైట్ సహాయంతో, లావాదేవీలు చాలా స్పీడ్ గా , ఈజీగా మారతాయని వాట్సాప్ చెబుతోంది. దీనిని చిన్న లావాదేవీల కోసం NPCI రూపొందించడం వల్ల ఈ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, రియల్ టైమ్ బ్యాంకింగ్ సిస్టమ్ అవసరం లేదు.
యూపీఐ లైట్‌తో పాటు యూజర్స్ సౌలభ్యం కోసం బిల్ పేమెంట్ ఫీచర్, మొబైల్ రీఛార్జ్ వంటి ఫీచర్లు కూడా యాప్‌కు జోడించనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్లు కంపెనీకి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఒకే యాప్‌లో చాట్, పేమెంట్, బిల్స్ పేమెంట్ ఫెసిలిటీ, మొబైల్ రీఛార్జ్ వంటి అనేక సేవలను పొందడంతో ఇక వేరే యాప్ ల వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది.