వర్షాకాలాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ హిల్‌స్టేషన్‌లకు వెళ్లిపోండి..

Best Way To Enjoy The Rainy Season by Going These Hill Stations in India,Best Way To Enjoy The Rainy Season,Enjoy The Rainy Season,Enjoy Rainy Season by Going These Hill Stations,Hill Stations in India,Mango News,Mango News Telugu,Places To Visit in India During Rainy Season,Best Hill Stations to Explore This Monsoon,Best Places to Visit in Rainy Season,Erkadu Hill Station in Tamil Nadu, Uttarakhand,Sarvarayan Temple,Ooty, Kodaikanal,Pelling in Sikkim,Enjoy Hill Stations in India

చాలామందికి వర్షాకాలం అంటే చాలా ఇష్టం. అయితే సిటీలలో వర్షం పడితే ఇంట్లోనే ఉన్నవాళ్లకు బాగానే ఉంటుంది.కానీ.. బయట ఉన్నవాళ్లు ఇంటికి రావడం అంటే పెద్ద ప్రహసనమే. అందుకే వర్షాకాలాన్ని ఆస్వాదించాలని ఉన్నా ఆ కోరిక సిటీవాసులకు కోరికగానే మిగిలిపోతుంది. ఇలాంటివాళ్లు రెయినీ సీజన్‌లో హిల్ స్టేషన్‌కు వెళితే ఓ మధురానుభూతిని జీవితాంతం మోసుకురావచ్చట.

చాలామంది హిల్ స్టేషన్స్ అంటే ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్ అనే అనుకుంటారు. కానీ అక్కడ పడే వర్షాలకు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఏ కొండ చరియ విరిగిపడుతుందో తెలియదు. చాలాసార్లు ట్రిప్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత సడన్‌గా ఆ మార్గాన్ని మూసేసే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ ప్లేసులను లిస్టులోంచి తీసేసి కొత్త హిల్ స్టేషన్స్‌ జాబితా రెడీ చేసుకోండి అంటున్నారు జర్నీ లవర్స్. వర్షాకాలంలో పచ్చని ప్రకృతి నడుమ విహరించాలనే ఆలోచన ఏ మాత్రం ఉన్నా.. ఈ ప్రదేశాలను చుట్టేయండి. వర్షాకాలంలో రద్దీ తక్కువగా ఉంటూ.. మంచి మధురానుభూతిని మిగిల్చే కొన్ని హిల్‌స్టేషన్‌లు భారత్‌లోనే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఈ ప్రాంతాలను సందర్శించడం.. ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతినిస్తుందంటారు ప్రకృతి ప్రేమికులు.

తమిళనాడుకు వచ్చే చాలా మంది ఊటీ, కొడైకెనాల్ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు . కానీ, చాలామంది తెలియనిదేమిటంటే ఏర్కాడు హిల్‌స్టేషన్ తమిళనాడులో చాలా ఫేమస్. కాకపోతే ఇక్కడ కూడా రద్దీ అంతగా కనిపించదు. ఏర్కాడ్ చల్లని వాతావరణం, విస్తారమైన కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్నిసందర్శించడానికి వెళ్లినపుడు.. ఇక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన సర్వరాయన్ ఆలయానికి ఖచ్చితంగా వెళతారు.కాఫీ తోటల పరిమళాలు, వర్షాకాలం హిల్ స్టేషన్ అనుభూతి, ఆధ్యాత్మిక భావన ఇలా అన్నీ ఏక కాలంలో కావాలనుకుంటే మాత్రం ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే.

అలాగే తమిళనాడులోని కూనూర్.. పశ్చిమ కనుమలలో రెండవ అతిపెద్ద హిల్ స్టేషన్. ఇది టీ తోటలు, అనేక ఇతర ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. కాకపోతే ఈ ప్రదేశం వేసవిలో సందర్శించడానికి బెస్ట్ ప్లేస్ గా చెబుతారు. అయినా కూడా వర్షాకాలంలో కూడా ఇక్కడి దృశ్యాలు పర్యాటకులను మైమరింపజేస్తాయి. ఇది దక్షిణ భారతదేశంలోని ఉత్తమ ట్రెక్కింగ్ ప్లేసులలో ఇది ఒకటి. ట్రెక్కింగ్‌, ఫొటోగ్రఫీ ప్రియులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం కూనూరు.

ఇక ఈశాన్య ప్రాంతంలో ఉండే అరుణాచల్ ప్రదేశ్.. చాలా అంటే చాలా అందమైన ప్రదేశం. ప్రత్యేకించి వర్షాకాలంలో చూడటానికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది. తూర్పు హిమాలయ శ్రేణుల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణమిది. తవాంగ్ ఈశాన్య భారతదేశంలోని 400 సంవత్సరాల పురాతన మఠానికి చెందిన పట్టణం అని.. ఈ మఠం భారతదేశంలో కనిపించే అతిపెద్ద బౌద్ధ ఆరామాలలో ఒకటి అని చెబుతారు. బౌద్ధమతపు అనుచరులకు ఒక ముఖ్యమైన యాత్రా కేంద్రం ఇది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, తవాంగ్ దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిందని అంటారు. ఎప్పుడూ టూరిస్టులు ఉంటారు కానీ పర్యాటకుల రద్దీ మాత్రం ఎప్పుడూ కనిపించకపోవడం దీని ప్రత్యేకత. తవాంగ్ టిబెట్‌, భూటాన్ సరిహద్దులో ఉంది ఈ ప్రాంతం. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, బౌద్ధ విహారాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు అని టూరిస్టులు చెబుతారు.

అటు సిక్కింలోని పెల్లింగ్‌ లో మంచు దుప్పటి కప్పుకున్నాయా అన్నట్లు కనిపించే పర్వతాలు,పర్వత శిఖరాల నుంచి విశాల దృశ్యాలు ఈ ప్రదేశానికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఈ నగరం నుండి కాంచన్‌జంగా అద్భుతమైన దృశ్యాలను కళ్లతోనే బంధించొచ్చు. అయితే ఇది వర్షాకాలంలో కంటే ఆగస్టు నెలలో ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ ప్రతిఏటా జరిగే వార్షిక కాంచనజంగా పండుగను ప్రత్యక్షంగా చూడొచ్చు. సింగ్‌షోర్ వంతెన, ఛంగే జలపాతం, ఖేచుపేరి సరస్సు మొదలైనవి ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని టూరిస్టులు చెబుతారు.

అలాగే అస్సాంలోని ఏకైక హిల్ స్టేషన్ హఫ్లాంగ్. సుదూరం నుంచే రారా రమ్మని పిలిచి పచ్చని అందాలు, పర్వతాలు, జలపాతాలు టూరిస్టులను కట్టిపడేస్తాయి. ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పర్యాటకులు ముద్దుగా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతం అస్సాం సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉండటంతో.. అస్సాం సంస్కృతిని దగ్గరగా చూడాలనుకునే వారు తప్పకుండా హఫ్లాంగ్‌ను సందర్శించాల్సిందే అంటారు ఇక్కడివారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nineteen =