ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను అనుసరించి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేక ఆఫర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో వినియోగదారులకు తక్కువ ధరలు, అదనపు బ్యాంక్ తగ్గింపులు, నో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే, ఇంటికే డెలీవరి చేయడమే కాకుండా, ప్రముఖ బ్రాండ్ల స్కూటర్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.
బజాజ్ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్:
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్లు ప్రయాణం. 2.9 కేడబ్యూహెచ్ బ్యాటరీ, నాలుగు గంటల్లో 80% చార్జింగ్. బ్లూటూత్ కాల్ ఫీచర్, రివర్స్ లైట్, స్టాప్ ల్యాంప్ వంటి స్మార్ట్ ఆప్షన్లు. అమెజాన్ ధర: రూ.95,998.
ఈవోక్స్ ఈ2 ఎలక్ట్రిక్ స్కూటర్:
దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, డిస్క్ బ్రేక్, యాంటీ థెఫ్ట్ లాకింగ్. నలుపు, ఎరుపు, నీలం రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ధర: రూ.51,499. గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్:
నాలుగు నుంచి ఆరు గంటల్లో చార్జింగ్, 60 కిలోమీటర్ల రేంజ్. ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌లైట్, కుషనింగ్ సీటు.
అమెజాన్ ధర: రూ.39,999.
గ్రీన్ సన్నీ స్కూటర్:
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణం, గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ధర: రూ.24,999. ఇలాంటివి మరిన్ని ఆఫర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ చౌక ధరల స్కూటర్లు, ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం మీకోసం!