అసదుద్దీన్ నయా స్ట్రాటజీతో కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

Is Asaduddins new strategy a shock to Azharuddin,Is Asaduddins new strategy a shock,shock to Azharuddin,Asaduddins new strategy,Mango News,Mango News Telugu,Telangana Election,MIM , Asaduddin Azharuddin, Asaduddins new strategy,shock to Congress,Telangana Elections,Mohammad Azharuddin,Cricket Player India,Asaduddin Owaisi,Asaduddins new strategy Latest News,Asaduddins new strategy Latest Updates,Azharuddin Latest News,MIM Latest News,MIM Live Updates
Telangana Election,MIM , Asaduddin Azharuddin, Asaduddin's new strategy,shock to Congress?

ఇప్పటి వరకూ తేలని లెక్కలకు, ఎన్నో అనుమానాలకు  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమాధానమిచ్చేశారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని  చెప్పడం కాదు.. పాతబస్తీతో పాటు 9 చోట్ల పోటీ చేస్తున్నట్లు క్లారిటీ  ఇచ్చేశారు.  అంతేకాదు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పోటీ చేసే జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌లో  పోటీకి దిగుతామని చెప్పి అజారుద్దీన్‌కు షాక్ ఇచ్చారు.

 

ఇప్పటి వరకు 7 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన తాము.. ఈ సారి  కొత్తగా..మరో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత ప్రకటించారు. ప్రస్తుతం పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్‌పూరా, బహదూర్‌పూరా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది.  అయితే ఈసారి కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు.

 

అసదుద్దీన్ నిర్ణయంతో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడకుండా గండి కొట్టేందుకు ఎంఐఎం నయా స్ట్రాటజీతో ముందుకు వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల సమయానికి కాంగ్రెస్ బలంగా తయారయిందన్న సర్వేల లెక్కలతో ..ఆ పార్టీకి అడ్డుకట్ట వేయడానికే అసదుద్దీన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా   సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కూడా మారుస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

 

అవును నిజంగానే ఎంఐఎం ఈసారి ..ఏకంగా నలుగురు సిట్టింగులను మారుస్తోందట. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌కు పోటీగా తమ అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. అయితే ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి బరిలో దిగతుండటం నిజంగానే అజారుద్దీన్‌కు గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

ఎప్పటి నుంచో  బీఆర్ఎస్ పార్టీకి.. ఎంఐఎం మిత్రపక్షంగానే  కొనసాగుతూ వస్తోంది. చాలా సభల్లో సీఎం కేసీఆర్ కూడా ఎంఐఎంతో కలిసి ఉంటామని పదే పదే చెబుతున్నారు. అయితే రాజేంద్ర నగర్ ,   జూబ్లీహిల్స్  నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే బరిలో ఉన్నారు. ఈ రెండు సెగ్మెంట్లలోనూ  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ ఉంటుందని అంతా అనుకుంటున్న సమయంలో.. ఎంఐఎం ఎంట్రీ  పొలిటికల్ హీట్‌ను పెంచేసింది.

 

ఇప్పటికే తెలంగాణలో నాలుగో ప్రధాన పార్టీగా తమ పార్టీ ఎదుగుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రీసెంటుగా  సంగారెడ్డిలో నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. అయితే ఈ  సారి ఎన్నికలలో 9 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఓవైసీ.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ అభ్యర్థులను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఒకటి రెండు రోజుల్లోనే తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =