మనిషి ఒకరోజు తిండి లేకపోయినా యాక్టివ్ గా ఉంటాడు కానీ.. నిద్ర లేకపోతే మాత్రం డీలా పడిపోతాడు. కొంతమంది ప్రతిరోజూ నిద్ర కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. చాలా సేపు దొర్లితే ఏ అర్ధరాత్రి దాటాకో .. ఏ తెల్లవారుజామునో నిద్ర పడుతుంది. ఇలాంటి వారంతా తమ డే కాస్త నిరుత్సాహంగానే గడుపుతారు. అంతేకాదు వీరిలో రోజురోజుకు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది.
నిజానికి అందరికీ కూడా నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర లేకపోతే మన శరీరం అలసిపోతుంది. దీనివల్ల అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిద్రలోనే మన శరీరంలోని కణాలు వాటికి అవి రిపేర్ చేసుకుంటాయి.అందుకే నిద్ర లేమి ఉండే వారిలో కణాలు దెబ్బతినేప్రమాదం ఉంటుంది. దీనివల్ల డయాబెటిస్,బ్లడ్ ప్రెషర్,ఆల్జిమర్స్,మధుమేహం,ఊబకాయం,రోగనిరోధక శక్తి తగ్గడం వంటి బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది.
నిద్రలేమితో బాధపడేవారిలో తరచుగా విటమిన్ డి లోపం ఉంటుందని తాము గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. డి విటమిన్ తో పాటు మరికొన్ని విటమిన్ లోపాలున్నా కూడా వారిలో నిద్రలేమి వంటి సమస్యలు కనిపిస్తాయని అంటున్నారు. మనిషికి కావాల్సిన విటమిన్లు అన్నీ ఉంటే అప్పుడే 6నుంచి 8 గంటలు మంచి నిద్రపడుతుందని..దీనివల్ల రోజంతా హుషారుగా గడపడంతో పాటు కొన్ని వ్యాధుల నుంచీ కూడా రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కరలేదు. ఎందుంటే సూర్యకాంతి నుంచి ప్రత్యక్షంగా లభించే విటమిన్. దీని లోపం ఉంటే సరైన నిద్ర రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విటమిన్ డి .. సూర్యరశ్మితో పాటు కోడిగుడ్లు,పెరుగు,చేపల్లో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ B12 లోపం కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. బి12 తక్కువగా ఉన్నా..శరీరానికి తగినంతగా లేకపోయినా ప్రశాంతమైన నిద్ర కరవవుతుంది.విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా నిద్రలేమి నుంచి బయటపడొచ్చు. కోడిగుడ్లు, ఆకుకూరలు,పాలు,పుట్టగొడుగుల్లో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే..నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పోషకాలు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. చేపలు, ఓట్స్ వంటి ఆహారాలు తీసుకుంటే నిద్రలేమి నుంచి ఒత్తిడిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
మెగ్నీషియం వల్ల ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు వంటివి తగ్గుతాయి. అలాగే మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేయడంలోనూ.. నరాల, కండరాలను బలంగా ఉంచడంలోనూ సహాయపడతుంది.చిక్కుడు కాయలు, సోయా, అవకాడో ,బంగాళదుంపలు వంటివి రెగ్యులర్‌గా తీసుకుంటే..శరీరానికి కావాల్సిన మెగ్నీషియం దొరుకుతుంది. కాల్షియం లోపం కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారంలో మిల్క్ ప్రొడెక్ట్స్‌ను చేర్చుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం లేకుండా కాపాడుకోవచ్చు. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE