టెలికాం రంగంలో పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ తాజాగా రెండు సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, అలాగే రిలయన్స్ జియో కూడా తన వినియోగదారుల కోసం ప్రత్యేక నూతన సంవత్సర ఆఫర్‌ను తీసుకువచ్చింది.
ఎయిర్‌టెల్ రూ. 398 ప్రీపెయిడ్ ప్లాన్
28 రోజుల వ్యాలిడిటీతో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
రోజుకు 2GB 5G డేటా, అపరిమిత లోకల్ మరియు STD రోమింగ్ కాల్స్, 100 రోజువారీ SMSలు కూడా అందిస్తుంది.
వినియోగదారులు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో లైవ్ క్రికెట్ మ్యాచ్లు మరియు సినిమాలను చూడవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 409 ప్రీపెయిడ్ ప్లాన్
22 OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌తో పాటు Airtel Xstream Play Premiumకి కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది.
రోజుకు 2.5GB డేటా, అపరిమిత 5G ఇంటర్నెట్, అపరిమిత కాలింగ్ మరియు 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది.
జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ – రూ. 2025
డిసెంబర్ 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత SMSలతో పాటు JioTV, JioCinema, Jio యాప్‌లకు
ఫ్రీ యాక్సెస్ ఉంటుంది.
ఇది దీర్ఘకాలం చెల్లుబాటు అయ్యే ప్రీమియం ప్లాన్‌గా నిలుస్తుంది.
ఎయిర్‌టెల్ మరియు జియో ల మధ్య ఈ కొత్త పోటీ వినియోగదారులకు అనేక ఆప్షన్లను తెచ్చిపెట్టింది. మీకు సరిగ్గా సరిపడే ప్లాన్ ఏదో మీరే ఎంచుకోండి!