ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లో.. ముందుండేది ఏంటి అని చిన్నపిల్లాడిని అడిగినా టక్కున వాట్సాప్ అనే చెబుతాడు. ఎందుకంటే కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందే ఉంటుంది కాబట్టి తన క్రేజ్‌ను కంటెన్యూ చేసుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారుల సేఫ్టీకి పెద్ద పీట వేస్తూ ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్.. తాజాగా మెట్రో ప్రయాణికుల కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.
మెసేజులు చేసుకోవడం, మనీ ట్రాన్స్‌ఫర్‌కు మాత్రమే పరిమితం కాకుండా మెట్రో యూజర్ల కోసం.. టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. దీనిలో భాగంగా వాట్సాప్ ఏఐ బాట్‌లో.. మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ తాజాగా తీసుకొచ్చింది. ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై,పూనే నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా ఈ సేవలను నాగ్‌పూర్‌కు కూడా విస్తరించారు.
వాట్సాప్‌లో మెట్రో టికెట్ సేవలు తెలుగు లాంగ్వేజ్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ వాసులు మెట్రో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే 8341146468 నెంబర్‌కు హాయ్( Hi) అని మెసేజ్ చేయాలి. లేదంటే మెట్రో టికెట్ కోసం వాట్సాప్‌లో వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా కూడా సరిపోతుంది. అలాగే వాట్సాప్‌లో క్విక్ పర్చేజ్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు.
మెట్రోలో ఎక్కువగా ప్రయాణం చేసే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ సహాయంతో రెగ్యులర్‌గా ఉపయోగించే రూట్లను సేవ్ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ ఇంకా ఈజీ అయ్యి..టికెట్‌ను వేగంగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతీసారి , స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్లను సెలక్ట్ చేసుకోవాల్సి అవసరం ఉండదు. మరోవైపు వాట్సాప్‌లో ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు వరకూ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అంతేకాదు ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికుల కోసం గ్రూప్ టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులతో ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE