వాట్సాప్​ స్కామ్స్​ పెరిగిపోతున్నాయట.. బీ కేర్ ఫుల్

WhatsApp and Online Scams Increasing Day by Day,WhatsApp and Online Scams,WhatsApp Scams Increasing Day by Day,WhatsApp Scams Increasing,Mango News,Mango News Telugu,Online Scams Increasing,How to Protect from online scams,Lottery Scams in India,Video Call Scams,How to Protect from online scams,Beware of growing WhatsApp fraud,WhatsApp Scams Latest News,WhatsApp Scams Live Updates,Online Scams News Today,Online Scams Latest News,Online Scams Latest Updates

ప్రతిఒక్కరి మొబైల్‌లో వాట్సాప్ కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తలో కేవలం వాట్సాప్ వాడటానికే మొబైల్స్ కొనేవాళ్ల సంఖ్య అప్పట్లో ఏం తక్కువ లేదు. అంతగా వాట్సాప్‌ను నెటిజన్లు అడాప్ట్ చేసేసుకున్నారు. అలా రోజురోజుకు వాట్సాప్ క్రేజ్ పెంచుకుంటుందే తప్ప ఏ మాత్రం డిజప్పాయింట్ చేయలేదు. కొత్తకొత్త ఫీచర్లతో యూజర్లను పెంచుకుంటూనే ఉంది. అయితే టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతకు వందరెట్లు ఆన్లైన్ స్కామ్స్ కూడా పెరిగిపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వారంతా యూజర్లు ఎక్కువగా వాడే యాప్స్‌నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ సైబర్ కేటుగాళ్ల చూపు వాట్సాప్‌ (WhatsApp) పైనే పడటం ఆందోళన కలిగించే విషయమే. ఇలా పెరిగిపోతున్న ఆన్​లైన్​ మోసాలు (Online Scams), స్కామ్స్ (Scams)​ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో అంతా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి వాట్సాప్​ ఇప్పుడు అందరి లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. ఎక్కడ ఉన్నా తమ సన్నిహితులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారాన్ని చిటికెలో అందించడానికి.. తెలుసుకోవడానికి వాట్సాప్‌ను మించింది లేదన్న స్టాంప్ వేసేసుకుంది. కానీ ఈ యాపే ఇప్పుడు స్కామ్​లకు, మోసపూరిత కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

నిజానికి ఇండియాలో వాట్సాప్‌కు అతిపెద్ద యూజర్​ బేస్ (User Base)​ ఉంది. అందుకే ఆన్​లైన్​ మోసగాళ్లు (Online Cheaters), సైబర్​ నేరగాళ్లు (Cyber Cheaters) దీనిపై కన్నేశారు. వీరు చేసే స్కామ్​ చాలా రూపాల్లో ఉంటాయి. ముఖ్యంగా వీరి వలలో చిక్కుకున్నవారిని ఆర్థికంగా దోపిడీ చేస్తారు. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మరీ ఘోరంగా బాధితుల ఐడెంటీ (Identity)ని కూడా తస్కరిస్తారు.

స్కామర్లు మంచి పేరున్న సంస్థలు, వ్యక్తుల పేర్లతో ఇలాంటి స్కామ్​‌లకు పాల్పడుతుంటారు. మంచి ఉద్యోగం ఆఫర్ (Job Offer) ఉందని ఆశ పుట్టిస్తారు. లేదా ఈజీగా మనీ సంపాదించే మార్గం చెబుతామని అత్యాశను తట్టి లేపుతారు. కొన్ని కొన్ని సార్లు ఆకర్షణీయమైన ఆఫర్లు (Offers), బహుమతుల (Gifts) పేరిట పెద్ద వల విసురుతారు. పొరపాటున వీటి ట్రాప్​‌లో కానీ పడ్డారో. ఇక అంతే సంగతులు. మీకు తెలీకుండానే మీ అకౌంట్లు ఖాళీ చేసి కొంప కొల్లేరు చేసేస్తారు. అసలు వీరి పంపిన మెసేజెస్ నిజమైనవా? లేదా నకిలీవా? అని కనిపెట్టడం కూడా చాలా కష్టంగా ఉండటంతో చాలామంది మోసపోతున్నారు.

ఈ స్కామ్స్‌లో ఎక్కువగా మోసపోతుంది వీడియో కాల్ స్కామ్స్ (Video Call Scams). ఈ కేటుగాళ్ల అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిల ప్రొఫైల్​ పిక్చర్స్‌ను డీపీ (DP)గా పెట్టుకుని.. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు వీడియో కాల్​ చేస్తారు. పొరపాటున వాటిని లిఫ్ట్ చేస్తే, మెల్లగా మాటల్లోకి దింపి న్యూడ్​ ఫోటోలు (Nude Photos), వీడియోలు (Nude Videos) పంపిస్తారు. అంతేకాదు కొన్ని సార్లు న్యూడ్​ కాల్స్ (Nude Calls) వరకూ ట్రాక్‌ను కంటెన్యూ చేస్తారు. ఒకవేళ వారు చెప్పినట్లే చేస్తే దానిని జాగ్రత్తగా రికార్డ్ (Record) చేస్తారు.ఈ తర్వాత డబ్బులు డిమాండ్​ చేస్తూ, బెదిరిస్తారు. కనుక ఇలాంటి కాల్స్​ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

సైబర్​ నేరగాళ్లు లాటరీ ప్రైజ్ ​మనీ​ పేరుతో ఫ్రాడ్స్ ( Lottery Scams in India) చేస్తుంటారు. ముఖ్యంగా లాటరీలో పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నారంటూ.. వ్యక్తులకు ఈ-మెయిల్స్​, ఫొటోస్ , మెసేజెస్ పంపిస్తారు. ఎవరైనా పొరపాటున వీటిని నమ్మితే.. ఒక ఫోన్ నంబర్ ఇచ్చి, ఆ నంబర్​‌కు కాల్​ చేసి లాటరీ డబ్బులు గురించి మాట్లాడమని నమ్మిస్తారు. ఆ నంబర్​‌కు ఫోన్​ చేస్తే, గెలిచిన డబ్బు పంపడానికి కొంత డబ్బును సెక్యూరిటీగా కట్టవలసి ఉంటుందని, తర్వాత దానిని రిఫండ్​ చేస్తామని నమ్మిస్తారు. ఇలా చాలామంది ఇప్పటికే మోసపోయారు.

సైబర్​ క్రిమినల్స్​ ఎక్కువగా యూత్‌ను క్రిప్టో స్కామ్స్​ (Crypto Scams)లో మోసం చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే, చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బును వేగంగా సంపాందించవచ్చని నమ్మిస్తారు. దీనిని నమ్మి డిజిటల్​, క్రిప్టో కరెన్సీలలో ఇన్​వెస్ట్​ చేస్తే ఇక అంతేసంగతులు. అలాగే స్కామర్స్.. చాలామందికి క్యాష్​ ప్రైజ్​ వచ్చిందని నమ్మిస్తూ, క్యూఆర్​ కోడ్​ల (QR Code Scams 2023)ను పంపిస్తున్నారు. ఈ క్యూఆర్​ కోడ్​లను పొరపాటున స్కాన్ చేశారో.. మీ బ్యాంకు అకౌంట్​ మొత్తం ఖాళీ అవుతుంది.

ఆన్​లైన్​ స్కామ్స్​, వాట్సాప్​ స్కామ్స్ ​ నుంచి తప్పించుకోవాలంటే (How to Protect from online scams) కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్​లను, ఈ-మెయిల్​స్‌ను, వాటి అటాచ్‌మెంట్లను క్లిక్ చేయొద్దు. అలాగే ఎవరో తెలియని వ్యక్తులు.. మన వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అర్జెంట్​గా డబ్బులు కావాలి అంటూ తెలిసిన వారి ఫోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చినా నమ్మొద్దు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =