కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అందరిలోనూ సందడి మొదలవుతుంది. ఒకప్పుడ కేక్ కటింగ్‌కు, దావత్‌కు మాత్రమే పరిమితనమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్లలో ఇప్పుడు మందేస్తూ చిందేయడాలు,కేరింతలు పెడుతూ డీజేలు పెట్టి డ్యాన్సులు వేయడాలు కూడా ఎంటర్ అయిపోయాయి. అంతేకాదు గతంలో సిటీల్లో మాత్రమే ఉండే ఈ కల్చర్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సిటీల్లో న్యూ ఇయర్ సంబురాలకు రీస్టార్టులు, పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, ఇలా అన్ని సిద్ధం చేస్తారు.
అయితే న్యూ ఇయర్ వేడుకలు అంటే సంతోషాలు మాత్రమే కాదు.. కొన్ని చోట్ల విషాదాలు కూడా జరుగుతుంటాయి. అతిగా మద్యం తాగి గొడవలకు దిగడం, దాడులకు పాల్పడడం,తాగిన మత్తులో వేగంగా వాహనాలను డ్రైవ్ చేయడం, కొన్ని చోట్ల విద్యుత్ షాక్ లు ఇలా రకలరకాల కారణాలతో ప్రాణాలు పోయిన ఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి.
అయితే, వీటి నుంచి రక్షణ కల్పించడానికి ప్రతీ సారి పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆ రోజు అంతా మద్యానికి దూరంగా ఉండాలని ‘లిక్కర్ ఫ్రీ న్యూ ఇయర్’ జరుపుకోవాలని కోరుతూ ఉంటారు. అయినా జనాలు మాత్రం పట్టించుకోరు. ముఖ్యంగా యువత ఈ హెచ్చిరికలను పెడచెవిన పెడుతుంది.
అయితే ఈసారి తాగి వాహనం నడిపినా, ఇతర గొడవలకు పాల్పడినా చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక్క సిటీలోనే కాదు అన్ని గ్రామాలలోనూ ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు, బస్టాండ్లుతో పాటు రహదారుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో లాగా ఫైన్ వేసి సరిపెట్టం అని శిక్షలు కూడా అమలు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు. మరి ఈసారి కొత్త సంవత్సరంలో ఎలాంటి కేసులు నమోదవుకుండా ఉంటాయో..ఎప్పటిలాగే ఉంటాయో చూడాలి.