ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరమే: సుప్రీంకోర్టు

Supreme Court Expresses Anger Over Caste Discrimination Against Prisoners In Jails, Supreme Court Expresses Anger Over Caste Discrimination, Caste Discrimination Against Prisoners In Jails, Caste Discrimination, Jail, Prisoners In Jails, Supreme Court, Anger Over Caste Discrimination, Supreme Court Scraps Caste Based Discrimination, Supreme Court Slams Caste System In Prisons, Caste Discrimination In Prisons, National News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని స్పష్టం చేసింది. ఇలాంటి తీర్పును ఇచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదానికి పాల్పడిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చెల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లను సోమవారం విచారించింది. మద్రాసు హైకోర్టు తీర్పును ఈ బెంచ్ తప్పుబట్టింది.

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ అది పోక్సో చట్టం కింద నేరార్హమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. న్యాయస్థానాలు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు తీర్పును సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ‘ఛైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేటివ్‌ అండ్‌ అబ్యూజివ్‌ మెటీరియల్‌’ అనే పదంగా మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు ఆర్డినెన్స్‌ జారీ చేసుకోవచ్చని, ఇకపై కోర్టులు ‘ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ’ పదాన్ని ఉపయోగించవద్దని ధర్మాసనం ఆదేశించింది.

కాగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కింది కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతూ.. వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికీ షేర్ చేయలేదని, ఎవరినీ వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు గత జనవరిలో తీర్పు చెప్పింది.

యువకుడిపై క్రిమినల్‌ చర్యలను నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరి 11న మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం నేరమేమీ కాదంటూ ఆ సందర్భంగా పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకూ పంపలేదని వ్యాఖ్యానించింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని తెలిపింది.