ప్రస్తుత కాలంలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ సరికొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. తాజాగా “మ్యాంగోతెలుగు సినిమా” యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ‘కలల ప్రపంచం’ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు నెట్టింట మంచి టాక్ సొంతం చేసుకుంటోంది.
ఈ చిత్రంలో హేమంత్ ఉద్భవ్ మరియు హారిక మహంతి ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిద్దరి పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు కుంచాల ఈ చిత్రానికి రచన , ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహించారు. ఒక అందమైన భావోద్వేగభరితమైన కథాంశంతో ఆయన ప్రేక్షకులను మెప్పించారు.
ఈ చిత్రాన్ని ఈగల హేమంత్ నిర్మించారు. హర్ష జయంత్ అందించిన సంగీతం సినిమాలోని మూడ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. క్వాలిటీ మేకింగ్ మరియు మనసుని తాకే సంభాషణలు సినిమాను రిచ్‌గా మార్చాయి.







































