సిడ్నీ పర్యటనలో డాల్ఫిన్‌లు, క్వాలాలతో యూట్యూబర్ శాంతి సందడి చేశారు. పోర్ట్ స్టిఫాన్స్‌లో డాల్ఫిన్ క్రూజింగ్‌తో పాటు, క్వాలా సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడి విశేషాలను తన ‘లైఫ్ ఆఫ్ శాంతి’ వ్లాగ్‌లో పంచుకున్నారు. గాయపడిన క్వాలాలను అక్కడి సిబ్బంది ఎలా కంటికి రెప్పలా కాపాడుతున్నారో ఆమె వివరించారు.
ఈ ట్రిప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది 26 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇసుక తిన్నెలు (Sand Dunes). ఇక్కడ ఫోర్ వీలర్ ట్రక్కులో ప్రయాణిస్తూ, సాండ్ బోర్డింగ్ చేసిన అనుభవం అద్భుతమని ఆమె పేర్కొన్నారు . కేవలం 200 ఆస్ట్రేలియన్ డాలర్లకే లంచ్‌తో కూడిన ఈ గైడెడ్ టూర్, సోలో ట్రావెలర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని శాంతి తన వ్లాగ్ ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ సిడ్నీ నగరంలోని బాణసంచా వేడుకలతో ఈ పర్యటన ముగిసింది.







































